ప్రశాంతంగా బీసీ గురుకుల ప్రవేశ పరీక్ష
ABN , First Publish Date - 2020-03-16T12:29:26+05:30 IST
జిల్లాలో ఆదివారం బీసీ గురుకుల పాఠశాల ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా జరిగింది.
ఖమ్మం ఎడ్యుకేషన్, మార్చి15: జిల్లాలో ఆదివారం బీసీ గురుకుల పాఠశాల ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా జరిగింది.జిల్లా కేంద్రమైన ఖమ్మంలో మొత్తం 16 కేంద్రాల్లో ఈ పరీక్షను నిర్వహించారు. 6,7,8 తరగతుల ప్రవేశాలకు మొత్తం 3724 మంది విద్యార్ధులకు 3149మంది హాజరుకాగా, 575 మంది గైర్హాజ రయ్యారు. ఉదయం 10గంటల నుంచి 12గంటల వరకు ఎంట్రన్స్ పరీక్ష జరిగింది. రీజనల్ కో-ఆర్డినేటర్ జ్యోతి పర్యవేక్షించారు.