విద్యుత్ బిల్లులను ఆన్‌లైన్‌లో చెల్లించాలి: ట్రాన్స్‌కో ఏఈ
ABN , First Publish Date - 2020-03-24T12:26:14+05:30 IST
కరోనా వైర్‌సను నియంత్రించే దానిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన లాక్‌డౌన్ కార్యక్రమం నేపథ్యంలో ప్రజలు విద్యుత్ బిల్లులను

జూలూరుపాడు, మార్చి 23: కరోనా వైర్‌సను నియంత్రించే దానిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన లాక్‌డౌన్ కార్యక్రమం నేపథ్యంలో ప్రజలు విద్యుత్ బిల్లులను ఆన్‌లైన్ ద్వారా చెల్లించాలని మండల ట్రాన్స్‌కో ఏఈ రఘురామయ్య సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. తమ నెల వారీ బిల్లులను ఎన్‌పీడీసీఎల్ యాప్ ద్వారా, పేటీఎం, ఫోన్‌పే ద్వారా చెల్లించాలని వినియోగదారులను కోరారు.