అభ్యంతరాలుంటే తెలపండి

ABN , First Publish Date - 2020-12-02T04:49:12+05:30 IST

ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఖమ్మం- వరంగల్‌- నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ ఓటర్ల జాబితాను అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో అందుబాటులో ఉంచినట్లు జిల్లా అదనపు కలెక్టర్‌ ఎన్‌ మధుసూదన్‌రావు తెలిపారు.

అభ్యంతరాలుంటే తెలపండి
రాజకీయ పార్టీల ప్రతినిధులతో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ ఎన్‌ మధుసూదన్‌రావు

పట్టభద్రుల ముసాయిదా ఓటరు జాబితా విడుదల

రాజకీయపార్టీల ప్రతినిధులతో సమీక్షించిన అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌రావు

ఖమ్మం కలెక్టరేట్‌, డిసెంబరు 1: ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఖమ్మం- వరంగల్‌- నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ ఓటర్ల జాబితాను అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో అందుబాటులో ఉంచినట్లు జిల్లా అదనపు కలెక్టర్‌ ఎన్‌ మధుసూదన్‌రావు తెలిపారు. ఓటరు జాబితాల్లో తప్పులు ఉన్నా, అభ్యంతరాలు ఉన్నా తెలియచేయాలని ఆయన కోరారు. మంగళవారం తన చాంబర్‌లో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖమ్మం, వరంగల్‌, నల్లగొండ పట్టభద్రుల ఓటరు జాబితాను విడుదల చేసినట్లు తెలిపారు. 81,160 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. వీరిలో పురుషులు 52,059, స్త్రీలు 29,090, ఇతరులు 11మంది ఉన్నారని తెలిపారు. ప్రకటించిన ముసాయిదా ఓటర్ల జాబితాలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే డిసెంబర్‌ 31లోగా ఆయా తహసీల్దార్‌ కార్యాలయంలో అందచేయాలని సూచించారు. ఈ నెల రోజుల్లో ఓటు హక్కు రాని వారు కూడా దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. ఫారం 18 ద్వారా లేకుంటే ఛ్ఛిౌ.్ట్ఛజ్చూుఽజ్చుఽ్చ.ుఽజీఛి.జీుఽ అనే వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లోనూ దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. పట్టభద్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అదనపు కలెక్టర్‌ కోరారు. ఈ సమావేశంలో బీజేపీ నుంచి జి. విద్యాసాగర్‌, సీపీఐ నుంచి వెంకటేశ్వరరావు, సీపీఎం నుంచి ప్రకాష్‌, కాంగ్రెస్‌ నుంచి శ్రీనివాసరావు, టీఆర్‌ఎస్‌ నుంచి ఆర్జేసీ కృష్ణ, టీడీపీ నుంచి సురేష్‌, సీతయ్య, వైసీపీ నుంచి అక్కిరెడ్డి, తో పాటు ఎన్నికల డీటీ రాళ్లబండి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-02T04:49:12+05:30 IST