‘సాగర్’ ఉపఎన్నికలో పోటీ చేస్తాం
ABN , First Publish Date - 2020-12-30T04:53:49+05:30 IST
నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో మహాజన సోషలిస్టు పార్టీతో కలిసి ఎంఆర్‌పీ ఎస్ పోటీచేస్తుందని ఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ స్పష్టం చేశారు.
ఏన్కూరులో ఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ స్పష్టీకరణ
ఏన్కూరు, డిసెంబరు 29: నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో మహాజన సోషలిస్టు పార్టీతో కలిసి ఎంఆర్‌పీ ఎస్ పోటీచేస్తుందని ఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ స్పష్టం చేశారు. మంగళవారం ఏన్కూరు వచ్చిన ఆయన అంబేద్కర్, కొమరం భీం విగ్రహాలకు పూలమాలలువేసి నివాళులర్పిం చారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మా ట్లాడారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలయ్యాయని, ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ కూడా ప్రజాసమస్యల పరిష్కారానికి పోరాడటం లో విఫలమైందని మండిపడ్డారు. బీజేపీ, టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు ఒకతాను ముక్కలేనని విమర్శించారు. ఎస్సీవర్గీకరణకోసం 26ఏళ్లనుంచి పోరాటం చేస్తుందని, కేంద్రంలో అధికారంలోకి వస్తే వందరోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పిన బీజేపీ ఆరేళ్లు దాటినా పట్టించుకోవడంలేదని అన్నారు. అదే విధంగా ముఖ్యమం త్రి కేసీఆర్ సైతం గతంలో అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి పార్లమెంట్‌లో ఎస్సీ వర్గీకరణకు కృషిచేస్తామని చెప్పి ఏళ్లుదాటుతున్నా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిం దన్నారు. మూడెకరాల భూమి ఇస్తామని, చెప్పిన సీఎం ఆ మూడు ఎకరాలు ఇవ్వకపోగా అసైన్డుభూములను వారి అవసరాలకు లాగేస్తున్నారన్నారు. సాగర్ ఉపఎన్నిక ల్లో ప్రజలకు ఈ అంశాలపై వివరిస్తామని తెలిపారు. ఈ మూడు పార్టీలపై మాదిగలకు తీవ్ర అసంతృప్తి ఉందని, ధనబలం, పలుకుబడి రాజకీయాలు చుట్టూ తిరుగుతు న్నాయని, వీటిని ఉప ఎన్నికల్లో ఎదుర్కొంటామని ఉద్ఘాటించారు. ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్ నాయకులు తరగం నర్సింహారావు, నాగరాజు, రాంబాబు, ఇసనపల్లి నాగేశ్వరరావు, కృష్ణ, తడికమల్ల నర్సింహారావు శ్రీను, వెంకట్, రామకృష్ణ, వీరయ్య, నరేష్, తదితరులు పాల్గొన్నారు.