మావోయిస్టుల చేతిలో డీఆర్జీ జవాన్ హత్య
ABN , First Publish Date - 2020-03-13T12:13:11+05:30 IST
స్వగ్రామానికి వచ్చిన డీఆర్జీ జవానును మావోయిస్టులు హత్య చేసిన సంఘటన ఛత్తీ్‌సగఢ్ రాష్ట్రం సుకుమా జిల్లా

దుమ్ముగూడెం, మార్చి 12: స్వగ్రామానికి వచ్చిన డీఆర్జీ జవానును మావోయిస్టులు హత్య చేసిన సంఘటన ఛత్తీ్‌సగఢ్ రాష్ట్రం సుకుమా జిల్లా డోర్నపాల్ పోలీ్‌సస్టేషన్ పరిధి అర్గట్టా గ్రామంలో బుధవారం రాత్రి జరిగింది. అర్గట్టా గ్రామానికి చెందిన డీఆర్జీ జవాను కడతీ కన్నా హోలీ పండుగ మరుసటి రోజున తన గ్రామానికి చేరుకున్నాడు. ఈ సమాచారం తెలుసుకున్న మావోయిస్టులు కన్నాను ఇంటి నుంచి అర్ధరాత్రి అపహరించి తీసుకెళ్లారు. అనంతరం హత్య చేసి గ్రామ సమీపాన మృతదేహాన్ని పడేశారు.