అన్నదాతలు ఆందోళన చెందవద్దు

ABN , First Publish Date - 2020-04-05T10:34:10+05:30 IST

అన్నదాతలు ఆందోళన చెందవద్దని రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రాష్ట్ర

అన్నదాతలు ఆందోళన చెందవద్దు

మంత్రి పువ్వాడ


ముదిగొండ, ఏప్రిల్‌ 4: అన్నదాతలు ఆందోళన చెందవద్దని రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. శనివారం మండలంలోని మేడేపల్లి, కట్టకూరు, మాధాపురం, వనంవారిక్రిష్టాపురం గ్రామాల్లో సొసైటీల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి ప్రారంభించారు.  కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ ఆర్వీకర్ణన్‌, డీసీసీబీ చైర్మన్‌ కూరాకుల నాగభూషణం, జడ్పీచైర్మన్‌ లింగాల కమలరాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-04-05T10:34:10+05:30 IST