రోగులకు ఇబ్బంది రావొద్దు

ABN , First Publish Date - 2020-03-25T11:27:11+05:30 IST

కరోనా వైద్యసేవల్లో ఎటువంటి ఇబ్బందులు రావోద్దని, ఆదే క్రమంలో ఐసోలేషన్‌ వార్డులో ఉన్న రోగులకు మెరుగైన వైద్యసేవలు అందాలని కలెక్టర్‌ కర్ణన్‌ సూచించారు.

రోగులకు ఇబ్బంది రావొద్దు

షిప్టు పద్ధతిలో వైద్యులు, నర్సింగ్‌ విధులు కేటాయించాలి

జిల్లా ఆసుపత్రి, మమత వైద్యశాలను పరిశీలించిన కలెక్టర్‌


ఖమ్మంసంక్షేమవిభాగం,మార్చి 24: కరోనా వైద్యసేవల్లో ఎటువంటి ఇబ్బందులు రావోద్దని, ఆదే క్రమంలో ఐసోలేషన్‌ వార్డులో ఉన్న రోగులకు మెరుగైన వైద్యసేవలు అందాలని కలెక్టర్‌ కర్ణన్‌ సూచించారు. రోజు రోజుకు రోగుల సంఖ్య పెరిగినా ఆ మేరకు వైద్యులు, నర్సింగ్‌ ఉద్యోగులు విధులు నిర్వహించేలా షిప్ట్‌ పద్ధతిలో విధులు కేటాయించాలని కోరారు. మంగళవారం జిల్లా ఆసుపత్రిని, మమత వైద్యశాలను కలెక్టర్‌ కర్ణన్‌ ఆకస్మికంగా పరిశీలిం చారు. దగ్గు, జలుబు, కరోనా లక్షణాలతో ఉన్న రోగుల సంఖ్య, సాదారణ జలుబు, దగ్గు రోగుల సంఖ్యపై వివరాలు సేకరించారు. సాధారణ రోగులను కరోనా అనుమానిత రోగులను విడివిడిగా చూడాలని అందుకోసం ప్రత్యేకంగా ఓపీ సేవలు ఏర్పాటు చేయలని సూచించారు. 

Read more