నిత్యావసరాల కొరత రావొద్దు

ABN , First Publish Date - 2020-03-27T11:50:50+05:30 IST

‘రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్‌ కట్టడికి లాక్‌డౌన్‌ ప్రకటించింది ఈ నేపఽథ్యంలో నిత్యావసరాలైన బియ్యం, పప్పులు

నిత్యావసరాల కొరత రావొద్దు

ఉత్పత్తి, రవాణా సాఫీగా సాగాలి:  ఖమ్మం ఏఎంసీ చైర్మన్‌ 


ఖమ్మం మార్కెట్‌, మార్చి 26: ‘రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్‌ కట్టడికి లాక్‌డౌన్‌ ప్రకటించింది ఈ నేపఽథ్యంలో నిత్యావసరాలైన బియ్యం, పప్పులు రవాణాలో ఎటువంటి కొరత రాకుండా చూడాలి. వాటి ఉత్పత్తి, రవాణా సాఫీగా జరగాలని’ మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ మద్దినేని వెంకటరమణ పేర్కోన్నారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, జిల్లా కలెక్టర్‌ ఆర్‌వి. కర్ణన్‌ ఆదేశాల మేరకు ఆయన గురువారం నగరంలోని మార్కెట్‌ కార్యాలయంలో చాంబర్‌ ప్రతినిధులు, పప్పు, రైస్‌ మిల్లర్ల అసోసియేషన్‌ బాధ్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ప్రస్తుత నిల్వలు, సరుకుల లభ్యత, వారికున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.


కార్యక్రమంలో మార్కెట్‌ సెక్రెటరీ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, వర్తక సంఘం అధ్యక్షుడు చిన్ని కృష్ణారావు, ఉపాధ్యక్షుడు పత్తిపాక రమేష్‌, రైస్‌ మిల్లర్స్‌ సంఘ బాధ్యులు బొమ్మా రాజేశ్వరరావు, దాల్‌మిల్లర్ల సంఘ బాధ్యులు వేములపల్లి వెంకటేశ్వరరావు, వ్యాపారులు మాటేటి నాగేశ్వరరావు, దిరిశాల వెంకటేశ్వరరావు, బజ్జూరి రమణారెడ్డి, కార్మిక సంఘం నేత నున్నా మాధవరావు, ఎర్రా శ్రీకాంత్‌, అసిస్టెంట్‌ సెక్రెటరీ వెంకటేశ్వరరెడ్డి, సూపర్‌వైజర్‌ ఆంజనేయులు పాల్గొన్నారు.

Updated Date - 2020-03-27T11:50:50+05:30 IST