మాతాశిశుమరణాల రేటును తగ్గించండి
ABN , First Publish Date - 2020-12-12T04:30:57+05:30 IST
జిల్లాలో మాతా శిశు మరణాల రేటును తగ్గించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి భాస్కర్ నాయక్ ఆదేశించారు.
జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి భాస్కర్ నాయక్
కొత్తగూడెం కలెక్టరేట్, డిసెంబర్ 11: జిల్లాలో మాతా శిశు మరణాల రేటును తగ్గించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి భాస్కర్ నాయక్ ఆదేశించారు. శుక్రవారం జిల్లా వైద్యఆరోగ్యశాఖ కార్యాలయంలో జిల్లాలోని పట్టణ ఆరోగ్య కేంద్రాల సిబ్బందితో సంయుక్త సమావేశం నిర్వ హించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొని మా ట్లాడుతూ గర్బిణీస్త్రీల నమోదు సకాలంలో చేయడంతో పాటు వారికి ప్రతి నెల ఇమ్యునైజేషన్ చేయడం, ప్రభుత్వ ఆస్పత్రిలో సాధారణ కాన్పు జరిగేల సేవలందిందచాలన్నారు. అన్ని జాతీయ కార్యక్రమాలను అమలు చేస్తూ కొవిడ్ నియం త్రణలో భాగంగా ప్రజలకు ఆరోగ్య విద్యనందించాలన్నారు. మాస్క్‌లు ధరించాలని, భౌతిక ధూరం పాటించాలని, తరచూ శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకోవాలని, గుంపులుగుంపులుగా సంచరించవద్దన్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవించిన ప్రతి బాలింతకు కేసీఆర్ కిట్ అందేలా కృషి చేయాలన్నారు. జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో సీహెచ్‌వో నాగభూషణం, కమ్యూనిటీ ఆర్గనైజర్ పొన్నెకంటి సంజీవరాజు తదితరులు పాల్గొన్నారు.