1500 హోం క్వారంటైన్‌ బోర్డుల పంపిణీ

ABN , First Publish Date - 2020-05-13T06:37:01+05:30 IST

లాక్‌డౌన్‌ సడలింపులతో ఇప్పటి వరకు ఇతర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు తిరిగి జిల్లాకు రావటంతో నాలుగు రోజులుగా జిల్లాకు వచ్చే వారి

1500 హోం క్వారంటైన్‌ బోర్డుల పంపిణీ

ఖమ్మం సంక్షేమవిభాగం, మే 12: లాక్‌డౌన్‌ సడలింపులతో ఇప్పటి వరకు ఇతర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు తిరిగి జిల్లాకు రావటంతో నాలుగు రోజులుగా జిల్లాకు వచ్చే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. దీంతో రెండు రోజులుగా హోం క్వారంటైన్‌ బోర్డుల కొరత ఏర్పడటంతో కోవిడ్‌-19 జిల్లా నోడల్‌ అధికారి డాక్టర్‌ కొటిరత్నం సూచనలతో జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ మాలతి స్పందించారు. వెంటనే 1500హోం క్వారంటైన్‌ బోర్డులను ప్రింటింగ్‌ చేయించి మంగళవారం పీహెచ్‌సీ కేంద్రాల పరిధిలోని ఆరోగ్య ఉపకేంద్రాలకు పంపిణీ చేశారు.

Read more