మొక్కలు నాటి, మాస్కులు పంపిణీ

ABN , First Publish Date - 2020-07-20T10:28:47+05:30 IST

మండల మోటారు మెకానికల్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో ఆదివారం ఏన్కూరులోని జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాలలో మొక్కలు నాటారు.

మొక్కలు నాటి, మాస్కులు పంపిణీ

ఏన్కూరు, జూలై 19: మండల మోటారు మెకానికల్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో ఆదివారం ఏన్కూరులోని జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాలలో మొక్కలు నాటారు. అనంతరం వందమందికి మాస్కులు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఎస్సై శ్రీకాంత్‌ మాట్లాడుతూ మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ఈకార్యక్రమంలో యూనియన్‌ మండల అధ్యక్షుడు పెనుగొండ రంగారావు, ప్రధాన కార్యదర్శి శేఖర్‌, జాని, వేణు, నర్సయ్య, అశోక్‌, షరీఫ్‌, పాల్గొన్నారు.

Updated Date - 2020-07-20T10:28:47+05:30 IST