డిగ్రీ ప్రవేశాలకు చివరి అవకాశం
ABN , First Publish Date - 2020-12-16T04:46:27+05:30 IST
డిగ్రీ ప్రవేశాలకు విద్యార్థులకు ఈనెల 17న ఒక్కరోజు మాత్రమే దోస్త్ వెబ్ ఆప్షన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు హయ్యర్ ఎడ్యుకేషన్ అనుమతించింది.

ఖమ్మం ఎడ్యుకేషన్, డిసెంబరు 15: డిగ్రీ ప్రవేశాలకు విద్యార్థులకు ఈనెల 17న ఒక్కరోజు మాత్రమే దోస్త్ వెబ్ ఆప్షన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు హయ్యర్ ఎడ్యుకేషన్ అనుమతించింది. ఇప్పటి వరకు డిగ్రీలో చేరని వారు రిజిస్ట్రేషన్ చేసుకోనివారు, సీటు వచ్చినాకాలేజీలో చేరని విద్యార్థులకు ఎవరైనా 17వతేదీన దోస్త్ ద్వారా రిజిస్ర్టేషన్ చేసుకుని కళాశాల ఎంపిక చేసుకునే అవకాశం కల్పిందించి . ఇది చివరి అవకాశమని డిగ్రీ కళాశాల హయ్యర్ ఎడ్యుకేషన్ తెలిపింది.