అభివృద్ధి కార్యక్రమాల్లో రాజకీయాలు అనవసరం

ABN , First Publish Date - 2020-12-28T04:31:32+05:30 IST

మనం చెల్లించిన పన్నులను అభివృద్ధి పనులకు ప్రభుత్వం కేటాయిస్తుందని. అభివృద్ధి కార్యక్రమాల్లో రాజకీయాలు అనవసరమని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు.

అభివృద్ధి కార్యక్రమాల్లో రాజకీయాలు అనవసరం
చెక్కు అందిస్తున్న ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య

ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటున్నా:  సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర 

సత్తుపల్లి, డిసెంబరు 27: మనం చెల్లించిన పన్నులను అభివృద్ధి పనులకు ప్రభుత్వం కేటాయిస్తుందని. అభివృద్ధి కార్యక్రమాల్లో రాజకీయాలు అనవసరమని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. సత్తుపల్లి మండలంలోని 83మంది లబ్ధిదారులకు రూ.83,09,628 విలువగల కల్యాణలక్ష్మీ, షాదీముబారక్‌ చెక్కులను ఆయన క్యాంపు కార్యాలయంలో పంపిణీ చేశారు. అధిక వర్షాలు, కరోనా, ఆర్థిక ఇబ్బందులున్నప్పటికీ మన సత్తుపల్లి మునిసిపాలిటీ భవనం చాలా బావుందని మంత్రి కేటీఆర్‌ ప్రశంసించారన్నారు. అన్ని వనరులను వినియోగించుకుని ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటున్నామని, ఈ ఫెడరల్‌ సిస్టంలో ఎవరి ఎవరూ మరోకరు ఇవ్వరన్నారు. ప్రజలు స్వీకరించిన ఎమ్మెల్యేను తాను కాకుండా తిరస్కరించిన వ్యక్తి అభివృద్ధి కార్యక్రమాలు పంచడం ఎక్కడైనా చరిత్ర ఉందా, ఇదంతా తెలియని వ్యక్తులు మాట్లాడుతున్నారన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ ఎవరి వాటా ప్రకారం వారే ప్రజలకు వినియోగిస్తున్నారని, ఎవరి జేబులో డబ్బులు కేటాయించడం లేదన్నారు. సత్తుపల్లి-ఖమ్మం రహదారి పరిస్థితిని చూసి సింగరేణి సంస్థపై ఒత్తిడి పెంచి కేటాయించామని, విమర్శించేటప్పుడు వ్యక్తిగతంగా ఆలోచించాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో సూర్యనారాయణ, మునిసిపల్‌ కమిషనర్‌ కోడూరి సుజాత, ఇన్‌చార్జ్‌ తహసీల్దార్‌ సంపత్‌కుమార్‌, గిర్ధావర్లు విజయభాస్కర్‌, జగదీష్‌, మునిసిపల్‌ చైర్మన్‌ కూసంపూడి మహేష్‌, ఎంపీపీ దొడ్డా హైమావతి శంకరరావు, జడ్పీటీసీ కూసంపూడి రామారావు, డీసీసీబీ డైరెక్టర్‌ చల్లగుళ్ల కృష్ణయ్య, ఆత్మ చైర్మన్‌ హరికృష్ణారెడ్డి, సొసైటీ అధ్యక్షులు చిలుకుర్తి కృష్ణమూర్తి, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.


Updated Date - 2020-12-28T04:31:32+05:30 IST