అభివృద్ధిలో అగ్రగామిగా చేస్తా..

ABN , First Publish Date - 2020-12-21T04:47:15+05:30 IST

అభివృద్ధిలో సత్తుపల్లి నియోజకవర్గాన్ని ముందు వరుసలో ఉంచేందుకు తాను శక్తివంచన లేకుండా పనిచేస్తానని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు.

అభివృద్ధిలో అగ్రగామిగా చేస్తా..
తడీపొడి చెత్త బుట్టల పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే సండ్ర

 సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర 

రూ.3.36కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభం, శంకుస్థాపనలు

సత్తుపల్లి, డిసెంబరు 20 : అభివృద్ధిలో సత్తుపల్లి నియోజకవర్గాన్ని ముందు వరుసలో ఉంచేందుకు తాను శక్తివంచన లేకుండా పనిచేస్తానని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ఆదివారం మండలంలోని రామానగరం, తాళ్లమడ, బేతుపల్లి, పాకలగూడెం, కిష్టాపురం, తుంబూరు, నారాయణపురం గ్రామాల్లో సీఎస్‌ఆర్‌, ఈజీఎస్‌, జీపీ నిధులతో సీసీ రోడ్ల నిర్మాణాలకు శంఖుస్థాపన, వైకుంఠధామం, పల్లెప్రకృతి వనాలను ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ జలగం, తుమ్మల హయాంలో సత్తుపల్లిని ఆదర్శవంతంగా తయారు చేశారని, వారు ఎంచుకున్న మార్గంలో మనం నడవాలన్నారు. మండలంలో రూ.3.36కోట్లతో ఈ రెండు రోజులు అభివృద్ధి పనులకు కేటాయించగా మరికొద్ది రోజుల్లోనే ప్రతిపాదనలు పంపిన గ్రామాల్లో నిధులు కేటాయించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ దొడ్డా హైమావతి శంకరరావు, జడ్పీటీసీ కూసంపూడి రామారావు, మునిసిపల్‌ చైర్మన్‌ కూసంపూడి మహేష్‌, ఆత్మ చైర్మన్‌ హరికృష్ణారెడ్డి, డీసీసీబీ డైరెక్టర్‌ చల్లగుళ్ల కృష్ణయ్య, టీఆర్‌ఎస్‌ మండల పార్టీ అధ్యక్షుడు యాగంటి శ్రీనివాసరావు, సర్పంచీలు వేల్పుల కళావతి, పాకలపాటి శ్రీనివాసరావు, దేశిరెడ్డి రంగారెడ్డి, ఉప సర్పంచీలు మోరంపూడి శ్రీను, మల్లవరపు సావిత్రి, సొసైటీ చైర్మన్‌ చిలుకుర్తి కృష్ణమూర్తి, డైరెక్టర్‌ అప్పారావు, ఎంపీటీసీ నాగబత్తిన చంటి, టీఆర్‌ఎస్‌ నాయకులు కామా శ్యాంసన్‌, మోటపోతుల పుష్ప, సాయిలు, మేడా జగ్గారావు, చల్లగుళ్ల లోకేశ్వరరావు, అజయ్‌బాబు, దొడ్డా వెంకటేశ్వరరావు, దొడ్డా శ్రీనివాసరావు, నాగేశ్వరరావు, వెంకటేశ్వరరావు, సీతయ్య, దొడ్డా రాజేంద్రప్రసాద్‌, పాకలపాటి ప్రసాద్‌, ఏపూరి సాంబ, కొప్పుల ప్రవీణ్‌, బొలుసు రంగారావు, మనేన్ని రవి, మోహనరావు, పీఆర్‌ డీఈ మోహన్‌, ఏఈ వెంకటేశ్వరరావు, ఈజీఎస్‌ ఏపీవో ఎం.బాబు, ఎంపీవో కృష్ణ, గిర్దావర్‌ జగదీష్‌, సెక్రటరీలు వెంకటేశ్వరీ, వాసు పాల్గొన్నారు.


Updated Date - 2020-12-21T04:47:15+05:30 IST