ఆన్‌లైన్‌లో జిల్లాస్థాయి ఇన్‌స్పైర్: డీఈవో
ABN , First Publish Date - 2020-11-28T03:49:35+05:30 IST
ఇన్‌స్పైర్ మానిక్ జిల్లా స్థాయి మేళా ఆన్‌లైన్ విధానంలో యాప్‌ద్వారా నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి(డీఈవో) మదన్‌మోహన్ తెలిపారు.

ఖమ్మం ఎడ్యుకేషన్ నవంబరు27: ఇన్‌స్పైర్ మానిక్ జిల్లా స్థాయి మేళా ఆన్‌లైన్ విధానంలో యాప్‌ద్వారా నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి(డీఈవో) మదన్‌మోహన్ తెలిపారు. 2019-20 సంవత్సరానికి ఎంపికయిన 240మంది విద్యార్థులు తమ ప్రాజెక్టులకు సంబందించిన వీడియోలు 30ఎంబీకి మించకుండా ఉండాలన్నారు. 3 నుంచి 4 ఫొటోలు, 2నిమిషాలలోపు ఆడియో తయారు చేసి ఇన్‌స్పైర్ మానిక్ యాప్‌లో డిసెంబరు1నుంచి 10వతేదీ వరకు అప్‌లోడ్ చేయాల న్నారు. విద్యార్థుల అకౌంట్‌లో 10వేల రూపాయలు జమకాని వారు వివరాలను 1లోపు డీఈవో కార్యాల యంలో తెలపాలన్నారు. ఇతర వివరాలకు జిల్లా సైన్స్ అధికారి బి.సైదులు 9492005533 నెంబర్‌లో సంప్రదించాలని డీఈవో చెప్పారు.