డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-03-16T12:28:15+05:30 IST

మనస్థాపంతో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన శనివారం అర్థరాత్రి ఖమ్మంలో జరిగింది. త్రీటౌన్‌ పోలీసుల కథనం

డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య

క్రైం, మార్చి15: మనస్థాపంతో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన శనివారం అర్థరాత్రి ఖమ్మంలో జరిగింది. త్రీటౌన్‌ పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని శ్రీనివాసనగర్‌కు చెందిన కంభం గణేష్‌(18) నగరంలో ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. శనివారం డిగ్రీ రిజల్ట్‌ వచ్చింది. కాగా ఆ విద్యార్థి నాలుగు సబ్జెక్టులు ఫెయిలయ్యాడు. మనస్తాపం చెంది శనివారం అర్థరాత్రి ఇంట్లో అందరు నిద్రిస్తున్న సమయంలో గదిలోకి వెళ్లి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం తెల్లవారుజామున కుటుంబ సభ్యులు చూసి పోలీసులు సమాచారం అందించారు. వారి ఫిర్యాదుతో కేసు నమోదుచేసినట్టు పోలీసులు తెలిపారు.

Updated Date - 2020-03-16T12:28:15+05:30 IST