టీఆర్‌ఎస్ నాయకుడు బండారు హఠాన్మరణం
ABN , First Publish Date - 2020-06-25T10:20:14+05:30 IST
టీఆర్‌ఎస్ నాయకుడు, అప్పలనర్సింహాపురం సొసైటీ మాజీఅధ్యక్షుడు, నేలకొండపల్లి సొసైటీ మాజీ డైరెక్టర్, రైతుబంధు మండల డైరెక్టర్

నేలకొండపల్లి, జూన్24: టీఆర్‌ఎస్ నాయకుడు, అప్పలనర్సింహాపురం సొసైటీ మాజీఅధ్యక్షుడు, నేలకొండపల్లి సొసైటీ మాజీ డైరెక్టర్, రైతుబంధు మండల డైరెక్టర్ బండారు విశ్వనాధం(66)మంగళవారం రాత్రి హైదరాబాద్‌లోని ఓప్రైవేటు వైద్యశాలలో మృతి చెందారు. మృతదేహాన్ని బుధవారం తెల్లవారుఝామున అప్పలనర్సింహాపురం తీసుకొచ్చారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి తెలుగుదేశంలో క్రియాశీలక నాయకుడిగా కొనసాగారు. తుమ్మలతో పాటుగా టీఆర్‌ఎస్‌లో చేరారు.
మంచి మిత్రుడిని కోల్పోయా: మాజీ మంత్రి తుమ్మల
విశ్వనాధం మృతితో నాయకుడిగా కంటే తాను ఒక మంచి మిత్రుడిని కోల్పోయానని మాజీ మంత్రి తుమ్మల గద్గద స్వరంతో అన్నారు. బుధవారం ఉదయం అప్పలనర్సింహాపురం లోని మృతదేహంపై పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అనంతరం డీసీఎంఎస్ ఛైర్మన్ రాయల శేషగిరిరావు మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. మృతుడి కుటుంబానికి. సానుభూతి తెలిపారు.
తానొక ఆప్త మిత్రుని కోల్పోయానన్నారు. మాజీ మంత్రి, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు సంభాని చంద్రశేఖర్ ఫోన్ ద్వారా మృతుని కుటుంబానికి సంతాపం తెలిపారు. ఎంపీపీ వజ్జా రమ్య, టీఆర్‌ఎస్ మండల మాజీ అధ్యక్షుడు వెన్నపూసల సీతారాములు, డాల్డా జిల్లా అధ్యక్షుడు కొర్లకుంట నాగేశ్వరరావు, మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ శాఖమూరి రమేష్, నేలకొండపల్లి, కూసుమంచి రైతుబంధు మండల కన్వీనర్లు యడవల్లి సైదులు,జొన్నలగడ్డ రవి, ఆటో వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు కన్నెబోయిన వెంకటేశ్వర్లుయాదవ్, మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్లు ఎనికె జానకిరామయ్య, సూరపనేని రామకృష్ణ, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు వున్నం బ్రహ్మయ్య, సొసైటీ మాజీ అధ్యక్షుడు నల్లాని మల్లికార్జున్, ఆరెకట్ల గురునాధం, అధ్యక్షుడు కోటి సైదారెడ్డి, పగిడిపత్తి శ్రీను, సర్పంచ్ కర్లపూడి గురవయ్య, సీడీసీ మాజీ ఛైర్మన్ నెల్లూరి లీలాప్రసాద్, నెల్లూరి భధ్రయ్య, సామినేని వాసు, నర్రా పూర్ణచందర్‌రావు, కోటి శ్రీనివాసరావు, కాంగ్రెస్ మండల నాయకులు చిట్టూరి అచ్చయ్య, చిట్టూరి లక్ష్మీనారాయణ, తెలుగుదేశం జిల్లా అధికార ప్రతినిధి ఆరెకట్ల కొండలరావు, యలగాల భూషయ్య, బండారు రాంబాబు, మాజీ ఎంపీపీ తీగ వెంకటేశ్వరు, కూసుమంచి మాజీ ఎంపీపీ వెంకటరెడ్డి, పలువురు నివాళులర్పించారు.