నట్టల నివారణతోనే పశువుల్లో ఎదుగుదల

ABN , First Publish Date - 2020-12-20T03:35:13+05:30 IST

నట్టల నివారణతోనే పశువుల్లో ఎదుగుదల ఉంటుందని జిల్లా పశువైద్యాధికారి సత్యప్రసాద్‌ అన్నారు.

నట్టల నివారణతోనే పశువుల్లో ఎదుగుదల
పశువైద్యశిబిరాన్ని పరిశీలిస్తున్న సత్యప్రసాద్‌

పినపాక, డిసెంబరు 19: నట్టల నివారణతోనే పశువుల్లో ఎదుగుదల ఉంటుందని జిల్లా పశువైద్యాధికారి సత్యప్రసాద్‌ అన్నారు. శనివారం ఆయన మండలంలోని సీతారాంపురంలో నట్టల నివారణా శిబిరాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించారు. ఈ నెల 23 వరకు జరగనున్న ఈ కార్యక్రమాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో పినపాక పశు వైద్యాధికారిబాలకృష్ణ చవాన్‌ సిబ్బంది శేఖర్‌, శ్వేత, గోపాలమిత్రలు రామకృష్ణ, గోపాలకృష్ణ, నిర్మల పాల్గొన్నారు.


Updated Date - 2020-12-20T03:35:13+05:30 IST