కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన డీసీఎస్‌వో

ABN , First Publish Date - 2020-04-24T11:07:09+05:30 IST

మండలంలోని కె.లక్ష్మీపురం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా పౌర సరఫరాలశాఖ అధికారి బి.చంద్రప్రకాశ్‌ గురువారం తనిఖీ చేశారు.

కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన డీసీఎస్‌వో

దుమ్ముగూడెం: మండలంలోని కె.లక్ష్మీపురం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా పౌర సరఫరాలశాఖ అధికారి బి.చంద్రప్రకాశ్‌ గురువారం తనిఖీ చేశారు. ధాన్యాన్ని తాలు లేకుండా శుభ్రపరిచి కొనుగోలు కేంద్రాలకు తేవాలని రైతులకు సూచించారు. బియ్యం దిగుబడి తక్కువగా వచ్చే ధాన్యం రకాన్ని సైతం కొనుగోలు చేసేందుకు మిల్లర్లను ఒప్పించామని తెలిపారు.


రైతుల వద్ద ఉన్న ధాన్యం చివరి గింజ వరకూ కొంటామని అన్నారు. విత్తనసాగు వరిలో మగ రకం ధాన్యాన్ని కొనుగోలు చేయలేమని తెలిపారు. కార్యక్రమంలో డీటీ కెవెంకటేశ్వర్లు, ఏఈఓలు బాలాజీ, ప్రవీణ్‌, సొసైటీ సిబ్బంది సత్యనారాయణ ఉన్నారు.

Updated Date - 2020-04-24T11:07:09+05:30 IST