రైతుల సంక్షేమమే ధ్యేయం

ABN , First Publish Date - 2020-12-07T04:33:34+05:30 IST

రైతుల సంక్షేమమే ధ్యేయమని డీసీసీబీ ఛైర్మన్‌ కూరాకుల నాగభూషణం అన్నారు. అశ్వారావుపేట మండలంలోని నారాయణపురం, గుమ్మడివల్లిలో నారాయణపురం సహకార సంఘం ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుతో కలిసి ప్రారంభించారు.

రైతుల సంక్షేమమే ధ్యేయం
నారాయణపురంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న డీసీసీబీ ఛైర్మన్‌ కూరాకుల నాగభూషణం

డీసీసీబీ చైర్మన్‌ కూరాకుల నాగభూషణం

నారాయణపురం, గుమ్మడివల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం

అశ్వారావుపేట రూరల్‌, డిసెంబరు 6: రైతుల సంక్షేమమే ధ్యేయమని డీసీసీబీ ఛైర్మన్‌ కూరాకుల నాగభూషణం అన్నారు. అశ్వారావుపేట మండలంలోని నారాయణపురం, గుమ్మడివల్లిలో నారాయణపురం సహకార సంఘం ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుతో కలిసి ప్రారంభించారు. ఈసందర్భంగాసహకార సంఘం అధ్యక్షులు నిర్మల పుల్లారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో డీసీసీబీ ఛైర్మన్‌ కూరాకుల మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యాన్ని మద్ధతు ధరకు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని తెలిపారు. రైతులు తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించటం ద్వారా సంఘాలు మరింతగా అభివృద్ది చెందుతాయన్నారు. ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు మాట్లాడుతూ రైతులు కేంద్రాల వద్ద ఇబ్బందులు పడకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదేనన్నారు. తరుగు పేరుతో కోతలు పెట్టరాదన్నారు. రైతులు కూడా నిబంధనలు పాటిస్తూ ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. నిర్వాహకులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. సమావేశంలో పలువురు రైతులు గతంలోనూ తరుగు పేరుతో దారుణంగా కోతలు పెట్టారని, దీంతో తాము తీవ్రంగా నష్టపోయామని రైతులు ప్రజాప్రతినిధుల ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కో క్వింటాకు నాలుగైదు కిలోల చొప్పున నష్టపోయామని, భవిష్యత్తులో అవి జరగకుండా చూడాలని కోరారు. గతేడాది కాంటాకు సంబంధించిన నగదు తమ ఖాతాల్లో జమకాలేదని తెలిపారు. దీనిపై సంబందిత అధికారులతో మాట్లాడతానని ప్రజాప్రతినిధులు హామీ ఇచ్చారు. ఈసందర్భంగా ప్రజాప్రతినిధులను ఆయా గ్రామాల్లో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి, జడ్పీటీసీ వరలక్ష్మీ, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు జూపల్లి రమేశ్‌, సహకార సంఘం ఉపాధ్యక్షులు పుట్టా సత్యం, అశ్వారావుపేట సహకార సంఘం అధ్యక్షుడు నూతక్కి నాగేశ్వరరావు, సర్పంచి కంగాల పరమేశ్‌, కంజా గంగాభవాని, కొడిమి సీత, నారం రాజశేఖర్‌, ఎంపీటీసీ వల్లెపు తిరుపతిరావు, కుమారి, సహకార సంఘ బ్యాంకు మేనేజర్‌ నాగభూషణం, ఏఈవో షాకీరాభాను, రాయుడు, ఉప సర్పంచ్‌ చిన్నంశెట్టి వాసు, పలువురు సహకార సంఘం డైరెక్టర్లు, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు బండి పుల్లారావు, తెలుగుదేశం మండల అధ్యక్షుడు మందపాటి రాజమోహనరెడ్డి, నాయకులు చందా లక్ష్మీనర్సయ్య, బండారు శ్రీను, నులకాని శ్రీను, వెంకట నరసింహం, ఆకుల శ్రీను, చందు వేణుగోపాల్‌, ఇంటి శ్రీను పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-07T04:33:34+05:30 IST