100 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టివేత

ABN , First Publish Date - 2020-11-21T06:38:44+05:30 IST

పేదలకు అందాల్సిన పక్కదారి పడుతోంది. రెవెన్యూ అధకారుల నిర్లక్ష్యం మూలంగా ప్రజాపంపిణీ వ్యవస్థ సక్రమంగా అమలు కావడంలేదు. మండలంలోని వివిధ ప్రాంతాలనుంచి అక్రమంగా వ్యాపారులు...

100 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టివేత

తిరుమలాయపాలెం, నవంబరు 20: పేదలకు అందాల్సిన పక్కదారి పడుతోంది. రెవెన్యూ అధకారుల నిర్లక్ష్యం మూలంగా ప్రజాపంపిణీ వ్యవస్థ సక్రమంగా అమలు కావడంలేదు. మండలంలోని వివిధ ప్రాంతాలనుంచి అక్రమంగా వ్యాపారులు ఇతర ప్రాంతాలకు తరలిస్తూలాభాలు గడిస్తున్నారు. శుక్రవారం మండలంలోని దమ్మాయిగూడెం తాళ్లచెరువు గ్రామాల మధ్యన  అక్రమంగా నిలవ ఉంచిన 100 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని శుక్రవారం టాస్కుఫోర్సు ఏసీపీ వెంకటరావు ఆధ్వర్యంలో టాస్కుఫోర్స్‌ ఎస్‌ఐ ప్రసాద్‌, తిరుమలాయపాలెం ఎస్‌ఐ రఘు ఆధ్వర్యంలో పట్టుకున్నారు.


పిండిప్రోలుకు చెందిన అంగడి సురేష్‌ అనే వ్యక్తి అక్రమంగా సేకరించిన రేషన్‌ బియ్యాన్ని కోదాడకు చెందిన ఉపేందర్‌కు పంపించేందుకు ఏర్పాటుచేస్తున్నాడు. సమాచారం రావడంతో టాస్కుఫోర్సు ,తిరుమలాయపాలెం పోలీసులు దాడిచేసి 100క్వింటాళ్ల బియ్యంతోపాటు ఆటోనుకూడా స్వాధీనం చేసుకున్నారు. ఈదాడుల్లో కానిస్టేబుళ్లు కళింగరెడ్డి, హమీద్‌, తదితులు పాల్గొన్నారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నారు.

Updated Date - 2020-11-21T06:38:44+05:30 IST