‘డయల్‌ యువర్‌ కలెక్టర్‌’కు ఫిర్యాదులకు ప్రాధాన్యం

ABN , First Publish Date - 2020-12-08T05:14:59+05:30 IST

జిల్లా నలుమూలల నుంచి ప్రతి సోమవారం నిర్వహించే డయల్‌ యువర్‌ కలెక్టర్‌కు ప్రజలనుంచి వచ్చిన ఫిర్యాదులను తక్షణం పరిష్కరించి ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పెంచాలని జిల్లా అదనపు కలెక్టర్‌ కె. వెంకటేశ్వర్లు అధికారలను ఆదేశించారు

‘డయల్‌ యువర్‌ కలెక్టర్‌’కు ఫిర్యాదులకు ప్రాధాన్యం
ప్రజాసమస్యలను తెలుసుకొంటున్న అదనపు కలెక్టర్‌

 తక్షణం పరిష్కరించాలి

అధికారులను ఆదేశించిన అదనపు కలెక్టర్‌ కె వెంకటేశ్వర్లు.

కొత్తగూడెం కలెక్టరేట్‌, డిసెండర్‌ 7: జిల్లా నలుమూలల నుంచి ప్రతి సోమవారం నిర్వహించే డయల్‌ యువర్‌ కలెక్టర్‌కు ప్రజలనుంచి వచ్చిన ఫిర్యాదులను తక్షణం పరిష్కరించి ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పెంచాలని జిల్లా అదనపు కలెక్టర్‌ కె. వెంకటేశ్వర్లు అధికారలను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌ నుంచి ఆయన డయల్‌ యువర్‌ కలెక్టరేట్‌ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను నమోదు చేసుకొన్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు డయల్‌ యువర్‌ కలెక్టర్‌ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా 46 మంది తమ ఫిర్యాదులను ఫోన్‌ద్వారా వివరించారు.  ముక్కోటి ఏకాదశి ఉత్సవాల ఏర్పాట్లపై  ప్రత్యేక అధికారి అదనపు కలెక్టర్‌ అనుదీప్‌ సంబంధిత అధికారులను అడిగి తెలుసుకొన్నారు. ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని , సీతారామచంద్ర స్వామి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఏ  పీడీ మధుసూధన్‌రాజు, డీఆర్‌వో అశోక్‌ చక్రవర్తి, ఏవో గన్యా, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.


Updated Date - 2020-12-08T05:14:59+05:30 IST