ఫిట్‌నెస్‌పై అవగాహన కోసం సైకిల్‌ యాత్ర

ABN , First Publish Date - 2020-12-28T04:32:58+05:30 IST

శారీరక దృఢత్వాన్ని పెంపొందించుకోవడంతోపాటు ప్రజల్లో ఫిట్‌నె్‌సపై చైత న్యం, అవగాహన కల్పించేందుకు హైదరాబాద్‌కు చెందిన సీఐ రవీందర్‌రెడ్డి ఆధ్వర్యంలో 8మందితో కూడిన బృం దం శనివారం హైదరాబాద్‌ నుంచి సైకిల్‌యాత్ర చేపట్టింది.

ఫిట్‌నెస్‌పై అవగాహన కోసం సైకిల్‌ యాత్ర
సైకిల్‌యాత్ర బృందాన్ని సన్మానిస్తున్న, సీఐలు, ఎస్‌ఐలు

ముదిగొండ, డిసెంబరు 27: శారీరక దృఢత్వాన్ని పెంపొందించుకోవడంతోపాటు ప్రజల్లో ఫిట్‌నె్‌సపై చైత న్యం, అవగాహన కల్పించేందుకు హైదరాబాద్‌కు చెందిన సీఐ రవీందర్‌రెడ్డి ఆధ్వర్యంలో 8మందితో కూడిన బృం దం శనివారం హైదరాబాద్‌ నుంచి సైకిల్‌యాత్ర చేపట్టింది. ఈయాత్ర ఆదివారం రాత్రి ముదిగొండకు చేరుకుంది. ఖమ్మంజిల్లా సీఐలు తిరుపతిరెడ్డి, సత్యనారాయణరెడ్డి, రమణమూర్తి, ఎస్‌ఐలు రాము, నరేష్‌, పారిశ్రామికవేత్త వెంకట్రామిరెడ్డి, ముదిగొండ పోలీ్‌ససిబ్బంది వారికి ఘనస్వాగతం పలికి సన్మానించారు. ఈ యాత్ర వరంగల్‌, ఇల్లెందు, ఖమ్మం, కోదాడ మీదుగా 600కిలోమీటర్లు సాగి హైదరాబాద్‌కు చేరుకోనున్నట్లు వారు తెలిపారు.


Updated Date - 2020-12-28T04:32:58+05:30 IST