చురుగ్గా క్రాప్ బుకింగ్.. వివరాల ఆధారంగా ప్రభుత్వ కార్యాచరణ
ABN , First Publish Date - 2020-07-27T21:43:28+05:30 IST
రైతులు ఆరుగాలం పండించిన పంట ప్రభుత్వ మద్దతు ధరకు విక్రయించుకొనే సమయంలో సంబంధిత కొనుగోలు ఏజన్సీలు కొర్రీల భారన రైతులు పడకుండా ఉండేందుకు గ్రామస్థాయిలో తాము సాగుచేసిన

గ్రామస్థాయిలో మొదలైన పంటల నమోదు
నియంత్రిత సాగుపై రానున్న స్పష్టత
వైరా/ఖమ్మం(ఆంధ్రజ్యోతి): రైతులు ఆరుగాలం పండించిన పంట ప్రభుత్వ మద్దతు ధరకు విక్రయించుకొనే సమయంలో సంబంధిత కొనుగోలు ఏజన్సీలు కొర్రీల భారన రైతులు పడకుండా ఉండేందుకు గ్రామస్థాయిలో తాము సాగుచేసిన పంటల ఆన్‌లైన్ నమోదు ప్రక్రియ ఎంతో మేలు చేకూరుస్తుందని వ్యవసాయశాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. పంటల విక్రయాల సమయంలో రైతులు ఇబ్బంది పడకుండా ఉండేందుకుగానూ గ్రామస్థాయిలో ఆన్‌లైన్ పంటల నమోదు ఎంతో మేలు చేస్తుందని భావిస్తున్నారు. గ్రామస్థాయి పంటల నమోదు కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైంది. వానాకాలం(ఖరీఫ్) 2020-21సంవత్సరానికిగానూ సాగైన పంటల వివరాలను సమగ్రంగా సేకరిస్తున్నారు. రైతులు తమ పొలంలో ఏపంట సాగుచేశారో తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని మండల వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు.
రైతులు ఆన్‌లైన్ నమోదు వివరాలు..
ఫ రెవెన్యూ గ్రామం పేరు, రైతు పేరు, సర్వేనెంబర్, విస్తీర్ణం, వేసిన పంట, రకం, నీటి వసతి సౌకర్యం వంటి వివరాలను ఏఈవోకు అందించాలి. పంట నమోదు ప్రక్రియను రైతులు బాధ్యతగా భావించాలి. దీనివల్ల రానున్న రోజుల్లో విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల నిల్వలు ఏర్పాటుచేసుకునే అవకాశముంది.
భూమి కలిగిన పట్టాదారు, కౌలు చేసుకుంటున్న వారి వివరాలు నమోదు చేసుకొనే అవకాశముంది.
గ్రామంలో సాగులో ఉన్న విస్తీర్ణం ఎంత ఆన్‌లైన్ నమోదు చేసుకోవడం వల్ల పట్టాదారు పాస్‌పుస్తకాలు ఉన్నవారు ఇంకా ఎంత భూమి పట్టాకాకుండా పెండింగ్‌లో ఉంది. గుడి, బడి సంబంధిత భూములు, నవాబు నక్షాకు సంబంధించిన భూములు, ఇతర ఏకారణంతోనైనా పట్టాకాకుండా వ్యవసాయ సాగులో ఉన్న భూమి వివరాలన్నింటిపై స్పష్టత వస్తుంది.
రెవెన్యూ శాఖ నుంచి నాన్‌డిజిటల్ సైన్ ర్యాండ్ డేటాను తీసుకొని ఎవరైతే రైతు సాగులో ఉన్నారో వారి వివరాలు నమోదు చేస్తారు.
పంట కొనుగోలు సమయంలో రైతులు తమకు నమోదు కార్యక్రమం తెలియదని, కౌలురైతులమని భూములకు పట్టాలు కాలేదని కారణాలు చెప్పినా కొనుగోలు కేంద్రాల్లో పరిగణలోకి తీసుకోరు.
ఆన్‌లైన్ పంట నమోదుకు పట్టాదారు పాస్‌పుస్తకం లేక 1బీ లేక పహనీ, శిస్తు రశీదు లేనట్లయితే సర్వేనెంబర్ తెలియజేస్తూ ఉన్న ఏఆధారం ఉన్న జీరాక్స్ కాఫీపై ఏ సర్వేలోని ఎంత విస్తీర్ణంలో పంటలు వేశారో ఫోన్‌నెంబర్, సంతకంతో ఏఈవోకు అందించాల్సి ఉంటుంది.
ఈ ప్రక్రియ వల్ల ఈ ఏడాది ప్రభుత్వం చేపట్టిన పంటల నియంత్రణ కార్యక్రమంలో ఇబ్బందులు తొలగిపోతాయి. ప్రభుత్వం సూచించిన పంటలనే తమ భూముల్లో ఎంత విస్తీర్ణంలో సాగుచేశారో ఖచ్చితమైన వివరాలు అధికారుల వద్ద ఉంటాయి. పంటల కొనుగోళ్ల సమయంలో అధికారులు తేలిగ్గా రైతులకు ధ్రువీకరణ పత్రాలు జారీ చేసే అవకాశం ఏర్పడుతుంది. ఈ అవకాశాన్ని రైతులు ఉపయోగించుకోవాలని వ్యవసాయాధికారులు సూచించారు.