డేంజర్‌ జోన్‌ !

ABN , First Publish Date - 2020-03-04T12:28:48+05:30 IST

బూర్గంపాడు మండల పరిధిలోని మణుగూరు క్రాస్‌ రోడ్డు ఆకతాయిలకు, ఆసాంఘిక కార్యక్రమాలకు ఆడ్డగా మారింది.

డేంజర్‌ జోన్‌ !

ఆకతాయిలకు అడ్డాగా మణుగూరు క్రాస్‌ రోడ్డు

దారిదోపిడీలు, హత్య, అత్యాచార ఘటనలు

గిరిజనులే లక్ష్యంగా క్రిమినల్‌ చర్యలు..?


బూర్గంపాడు, మార్చి 3: బూర్గంపాడు మండల పరిధిలోని మణుగూరు క్రాస్‌ రోడ్డు ఆకతాయిలకు, ఆసాంఘిక కార్యక్రమాలకు ఆడ్డగా మారింది. మణుగూరు క్రాస్‌ రోడ్డు నుంచి సారపాక వైపునకు, మెండికుంట వైపునకు వెళ్లే వరకు దట్టమైన ఆడవిని తలపించేలా పరిసరాలు ఉంటాయి. ఇదే ఆదునుగా భావించిన ఆకతాయిలు ఆసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ స్థానికులతో పాటు వాహనదారులను భయాభ్రాంతులకు గురిచేస్తున్నారు. అంతేకాక గోదావరి పుష్కరాల సమయంలో ఆటవీశాఖ ఆధ్వర్యంలో ఆభివృద్ధి చేసిన పుష్కరవనంలో సైతం మందు బాబులు హల్‌చల్‌ చేస్తున్నారు.


యువకులు జల్సాలకు ఆలవాటు పడి దారి దోపిడీలకు పాల్పడుతూ దొరికిన కాడికి దోచుకుంటున్నారు. నాలుగు నెలల క్రితం పలువురు యువకులు అటుగా వచ్చిన ఓ జంటపై దాడి చేయడంతో యువకుడు పారిపోగా యువతిపై ఆత్యాచారానికి పాల్పడటంతో మణుగూరు ప్రాంతాన్ని చెందిన సదరు యువతి కుటుంబసభ్యుల సహాయంతో మణుగూరు పోలీసులకు పిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టి ఆరుగురు నిందుతులను ఆదుపులోకి తీసుకున్నారు.  


గతంలోనూ పలు ఘటనలు 

అప్పటి వరంగల్‌ జిల్లా మంగపేట మండలం తొగ్గూడెం గ్రామానికి చెందిన ఆదివాసీ మహిళ భర్తతో కలిసి భద్రాచలం వచ్చింది. పని ముగించికోని అదేరోజు రాత్రి ఆటోలో స్వగ్రామానికి వెళ్లేందుకు ఆటో ఎక్కారు. ఈ క్రమంలో ఆటో డ్రైవర్‌తో పాటు అప్పటికే అందులో ఉన్న ముగ్గురు వ్యక్తులు మహిళ భర్తపై దాడి ఆమెపై ఆఘాయిత్యానికి ఒడిగట్టారు. బాధితురాలి  ఫిర్యాదు మేరకు అప్పటి ట్రైనీ అధికారి, ప్రస్తుత అదిలాబాద్‌ ఎస్పీ విష్ణువారియర్‌, ప్రస్తుత మణుగూరు సీఐ షూకూర్‌లు కేసును దర్యాప్తు చేసి ఏడూళ్లబయ్యారం గ్రామంలో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.


అంతేకాక ఏడాది క్రితం ఏడూళ్ల బయ్యారం గ్రామానికి చెందిన వృద్ధురాలు లక్ష్మీపురం గ్రామానికి వచ్చేందుకు బయలుదేరింది కానీ ఆమె గమ్యానికి చేరలేదు. మరుసటి రోజు క్రాస్‌ రోడ్డు సమీపాన ఉన్న చెరువుసింగారం వాగు వద్ద ఆనుమానస్పద స్థితిలో మృతి చెందిన ఓ వృద్దురాలి మృతదేహం లభ్యమైంది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి గోదావరి ఒడ్డున ఆంత్యక్రియలు నిర్వహించారు. రెండు రోజుల తర్వాత వాట్సాఫ్‌ ద్వారా సమాచారం తెలుసుకున్న కుటుంబసభ్యులు పోలీ్‌సస్టేషన్‌కు చేరుకొని ఫిర్యాదు చేశారు. అదే విధంగా దుమ్ముగూడెం మండలానికి చెందిన వ్యక్తి భద్రాచలం నుంచి పాల్వంచ వైపునకు వెళుతుండగా ఆటో డ్రైవర్‌ నమ్మబలికి దారి దోపిడికి పాల్పడ్డాడు. దీంతో బాధితుడు పోలీసులుకు ఫిర్యాదు చేశాడు.  


గిరిజనులే లక్ష్యంగా ?

ఇదిలా ఉండగా బూర్గంపాడు మండలంలో జరుగుతున్న దారి దోపిడీలు, అఘాయిత్యాలకు పాల్పడేందుకు ఆకతాయిలు ఎక్కువుగా ఆదివాసీ గిరిజనులనే ఎంచుకుంటున్నట్లు తెలుస్తోంది. నిరక్ష్యరాస్యత, ఆమాయకత్వం వల్ల సమాచారం అధికారుల దృష్టికి వెళ్లకుండా ఉంటుందనే ఆలోచనతో ఇలా చేస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా బయట నుంచి వస్తున్న గిరిజనులకు ఇక్కడ వారితో సంబందాలు లే కుండా పోవడం సైతం వారికి అదునుగా మారుతున్నట్లు తెలుస్తోంది. గతంలో జరిగిన పలు సందర్భాల్లో గిరిజనులపై జరిగిన దాడులే ఇం దుకు నిదర్శనం.


తాజాగా లక్ష్మీపురం గ్రామానికి చెందిన యువకుడిని ఈ ఆటవీ ప్రాంతంలో పలువురు యువకులు బెదిరించి సెల్‌పోన్‌తో పాటు డబ్బు తీసుకొని పారరైనట్లు సమాచారం. వరుస సంఘటనలతో మండలంలోని సారపాక నుంచి మణుగూరు క్రాస్‌ రోడ్డుగా మీదుగా రాకపోకలు సాగించాలంటే వాహనదారులు భయాభ్రాంతులకు గు రవుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఈ ప్రాంతంపై దృష్టి సా రించి ప్రత్యేక రక్షణ చర్యలు తీసుకుకోవాలని స్థానికులు కోరుతున్నారు.


నిద్రావస్థలో నిఘా వ్యవస్థ..

బూర్గంపాడు మండలంలో అడుగు పెట్టింది మొదలు విడిచి వెళ్లేంత వరకు ప్రతి వాహనాన్ని కెమెరాలో బందించేలా అప్పటి పాల్వంచ సీఐ రాఘవేంద్రరావు నేతృత్వంలో పలువురు దాతల సహయంతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. కాగా ఆ కెమెరాలు మరమ్మతులకు గురి కావడంతో అవి ములనపడ్డాయి. మండలంలో పలు సందర్భాల్లో గుర్తు తెలియని వాహనాలు ఢీకొని పలువురు మృతి చెందడంతో పాటు తీవ్ర గాయాలపాలైన ఘటనలు ఉన్నాయి. అంతేకాకుండా సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో ఇటువంటి సంఘటనలు జరిగినపుడు నిందితులను గుర్తించేందుకు వీలుకావడం లేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు చొరవ తీసుకొని సీసీ కెమెరాలకు మరమ్మతులు చేయించాలని ప్రజలు కోరుతున్నారు. 


ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం: బొమ్మెర బాలకృష్ణ, ఎస్‌ఐ బూర్గంపాడు

బూర్గంపాడు మండలంలో జరుగుతున్న ఘటనలను అరికట్టేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఎటువంటి సమాచారం ఉన్నా స్థానికులు మా దృష్టికి తీసుకురావాలి. ఇటువంటి ఘటనలకు పాల్పడితే ఎంతటి వారైనా చర్యలు తప్పవు.


Updated Date - 2020-03-04T12:28:48+05:30 IST