ఉద్యమాన్ని చీల్చే కుట్ర

ABN , First Publish Date - 2020-12-16T05:24:35+05:30 IST

రైతుల ఉద్యమాన్ని చీల్చేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని సీపీఐ రైతు సంఘం నేతలు ఆరోపంచారు.

ఉద్యమాన్ని చీల్చే కుట్ర
ముగింపు సభలో మాట్లాడుతున్న నాయకులు

అసత్య ప్రచారాలు చేస్తున్న కేంద్రప్రభుత్వం

సీపీఐ పాదయాత్ర ముగింపులో వక్తలు

ఖమ్మం మయూరిసెంటర్‌ డిసెంబర్‌ 15: రైతుల ఉద్యమాన్ని చీల్చేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని సీపీఐ రైతు సంఘం నేతలు ఆరోపంచారు. నేలకొండపల్లిలో ప్రారంభమైన పాదయాత్ర మంగళవారం సాయంత్రానికి ఖమ్మం కలెక్టరేట్‌ వద్దకు చేరుకుంది. జడ్పీ సెంటర్‌లో గల అంబేద్కర్‌ విగ్రహనికి పూలమాల వేసి అనంతరం జరిగిన సభలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు భాగం హేమంతరావు మాట్లాడుతూ 20 రోజులుగా ఎముకలు కొరికే చలిని సైతం లేక్క చేయకుండా రైతులు ఆందోళన చేస్తుంటే దాని గురించి అలోచించకుండా మోదీ ప్రభుత్వం విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నిస్తోందన్నారు. రైతుల ఉదద్యమం వేనుక ఖలిస్థాన్‌ తీవ్రవాదులు ఉన్నారని ఆరోపించడం విడ్డూరంగా ఉందన్నారు. ఖలిస్థాన్‌ తీవ్రవాదులు ఉద్యమం వెనుక ఉంటే మీరు ఎవరితో చర్చలు జరిపారని ఆయన ప్రశ్నించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్‌ మాట్లాడుతూ మోదీ సర్కార్‌ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. గోవిందరావు అద్యక్షతన జరిగిన సభలో పాదయాత్రకు న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి గోకినపల్లి వెంకటేశ్వరరావు సంఘీబావం తెలిపి మాట్లాడారు, కార్యక్రమంలో కర్ణకుమార్‌, పోటు కళావతి, లతాదేవి, నాగేశ్వరరావు, సలాం, రఘుపతిరావు, రేణుక, శంకరయ్య, సాంబశివరెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-16T05:24:35+05:30 IST