ఒకే కుటుంబంలో ఐదుగురికి కరోనా.. ఖమ్మంలో కేసుల లెక్కలివీ..!

ABN , First Publish Date - 2020-08-10T16:01:23+05:30 IST

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆదివారం 37మందికి కరోనా లక్షణాలున్నట్టు నిర్ధారణైంది. ఖమ్మం జిల్లాలో 78మందికి ర్యాపిడ్‌ కిట్ల ద్వారా పరీక్షలు నిర్వహించగా 33మందికి పాజిటివ్‌ వచ్చినట్టు జిల్లా వైద్యఅధికారులు హెల్త్‌బులిటెన్‌లో పేర్కొన్నారు.

ఒకే కుటుంబంలో ఐదుగురికి కరోనా.. ఖమ్మంలో కేసుల లెక్కలివీ..!

మరో 37 మందికి పాజిటివ్‌

ఖమ్మం జిల్లాలో 33, భద్రాద్రిలో నలుగురికి నిర్ధారణ

పలు చోట్ల కిట్ల కొరతతో జరగని పరీక్షలు


(ఖమ్మం/భద్రాద్రి కొత్తగూడెం నెట్‌వర్క్‌):  ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆదివారం 37మందికి కరోనా లక్షణాలున్నట్టు నిర్ధారణైంది. ఖమ్మం జిల్లాలో 78మందికి ర్యాపిడ్‌ కిట్ల ద్వారా పరీక్షలు నిర్వహించగా 33మందికి పాజిటివ్‌ వచ్చినట్టు జిల్లా వైద్యఅధికారులు హెల్త్‌బులిటెన్‌లో పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నలుగురి కొవిడ్‌ లక్షణాలున్నట్టు తెలిసింది. ఖమ్మం జిల్లా  వైరాలో అత్యధికంగా పది పాజిటివ్‌ కేసులు రాగా వీరిలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు, వైరాలోని ఒకే కుటుంబానికి ముగ్గురు, మునిసిపాలిటీ ముఖ్య కౌన్సిలర్‌ ఒకరు, పట్టణానికి చెందిన మరొకరు ఉన్నారు. తిరుమలాపాలెంలో తల్లీకుమారుడికి పాజిటివ్‌ రాగా తాళ్లచెరువు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కరోనా లక్షణాలతో మృతిచెందాడు. 


పదిరోజుల క్రితం ఆయనకు పాజిటివ్‌ రావడంతో హోం ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో ఆదివారం మృతిచెందగా.. మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇక భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో నలుగురికి పాజిటివ్‌ వచ్చింది. అశ్వారావుపేట సీహెచ్‌సీలో ఐదుగురు పరీక్షలు చేయించుకోగా ఇద్దరికి పాజిటివ్‌ వచ్చినట్టు వైద్యాధికారులు నిర్దారించారు. అశ్వారావుపేట పోలీస్‌ స్టేషన్‌లో వరుసగా నలుగురు కరోనా బారిన పడటంతో అధికారులతో పాటు పలువురు సిబ్బంది హోమ్‌ క్వారంటైన్‌లో ఉండిపోయారు. అలాగే చుంచుపల్లి మండలంలో ఇద్దరికి పాజిటివ్‌ నిర్ధారణైంది. అయితే జిల్లాలోని పీహెచ్‌సీల్లో కరోనా ర్యాపిడ్‌ యాంటిజెన్‌ కిట్ల కొరత ఏర్పడింది. దీంతో ఆదివారం పరీక్షలు నిర్వహించలేదని అధికారులు తెలపడం గమనార్హం. దీంతో అనుమానంతో భయపడుతున్నవారు పరీక్షలు చేయించుకోలేని పరిస్థితి ఏర్పడింది. 

Updated Date - 2020-08-10T16:01:23+05:30 IST