ఖమ్మం జిల్లాలో 37 పాజిటివ్‌ కేసులు.. ఎక్కడెక్కడంటే..

ABN , First Publish Date - 2020-07-20T18:10:08+05:30 IST

ఖమ్మం జిల్లాలో రికార్డు స్థాయిలో కరోనా పాజిటీవ్‌కేసులు నమోదవుతున్నట్లు వైద్యఆరోగ్యశాఖ వర్గాలు పేర్కొన్నాయి. జిల్లాలో కొవిడ్‌ వైరస్‌ వెలుగు చూసిన తరువాత తొలిసారి ఆదివారం జిల్లాలో రికార్డు స్థాయిలో 37కేసులు నమోదు కావటం కరోనా తీవ్రతను తెలియజేస్తొంది.

ఖమ్మం జిల్లాలో 37 పాజిటివ్‌ కేసులు.. ఎక్కడెక్కడంటే..

ఖమ్మం(ఆంధ్రజ్యోతి): ఖమ్మం జిల్లాలో రికార్డు స్థాయిలో కరోనా పాజిటీవ్‌కేసులు నమోదవుతున్నట్లు వైద్యఆరోగ్యశాఖ వర్గాలు పేర్కొన్నాయి. జిల్లాలో కొవిడ్‌ వైరస్‌ వెలుగు చూసిన తరువాత తొలిసారి ఆదివారం జిల్లాలో రికార్డు స్థాయిలో 37కేసులు నమోదు కావటం కరోనా తీవ్రతను తెలియజేస్తొంది. వీటిలో ర్యాపిడ్‌ కిట్స్‌ ద్వారా చేసిన నిర్దారణ పరీక్షల్లో 28 పాజిటివ్‌ కేసులున్నాయి. మరో 9 కేసులు శ్యాంపిల్స్‌ ద్వారా వచ్చినట్లు వైద్యవర్గాలు పేర్కొంటున్నాయి. చింతకాని మండలంలో 2, మధిరలో 2, శ్రీనగర్‌కాలనీలో 4, పాండురంగాపురంలో 4, ప్రకాశ్‌నగర్‌ 2, బల్లేపల్లి 2, రాపర్తినగర్‌ 1, పీఎస్‌ఆర్‌ రోడ్డు 1, గుట్టలబజార్‌ 1, ముస్తాఫానగర్‌ 1, లెనిన్‌నగర్‌ 1, గాంధీనగర్‌ 1, సారదినగర్‌ 1,బైపాస్‌ రోడ్డు 1, రాజీవ్‌గంజ్‌ 1, భాగ్యనగర్‌తండా 1 వీటితో పాటుగా మరో 11పాజిటీవ్‌ కేసులు నమోదు జరిగాయి. కాగా జిల్లా వైద్యఆరోగ్యశాఖ రెగ్యూలర్‌గా విడుదల చేసే హెల్త్‌బులిటెన్‌ ఆదివారం విడుదల చేయలేదు. 

Updated Date - 2020-07-20T18:10:08+05:30 IST