ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనా సహాయ కేంద్రం

ABN , First Publish Date - 2020-03-24T12:26:42+05:30 IST

పాల్వంచ ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనా సహాయ కేంద్రా న్ని సోమవారం డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్ట ర్‌ పోటు వినోద్‌

ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనా సహాయ కేంద్రం

పాల్వంచ టౌన్‌, మార్చి 23: పాల్వంచ ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనా సహాయ కేంద్రా న్ని సోమవారం డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్ట ర్‌ పోటు వినోద్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమం త్రి కేసీఆర్‌ ఆదేశానుసారం కరోనా వైరస్‌ ప్రభావం అధికంగా ఉన్న నేపథ్యంలో పా ల్వంచ ప్రభుత్వ ఆస్పత్రిలో సహాయ కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.


దగ్గు, జలుబు, జ్వరం, గొంతు నొప్పి తదితర లక్షణాలు కలిగిన వ్యక్తులు వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. ఏదైనా సలహాలు పొం దగోరే వారు ఈ సహాయ కేంద్రం ద్వారా తెలుసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ముక్కంటేశ్వరరావు, సీహెచ్‌వో రామకృష్ణ, రాంబాబు, హెడ్‌ నర్సు కనకదుర్గ, సిబ్బంది పాల్గొన్నారు.

Read more