నియోజకవర్గ అభివృద్ధికి కృషి
ABN , First Publish Date - 2020-12-16T04:42:58+05:30 IST
వైరా నియోజకవర్గ అభివృద్ధికి తన శక్తివంచన లేకుండా కృషిచేస్తున్నానని ఎమ్మెల్యే రాములునాయక్ పేర్కొన్నారు.
ఎమ్మెల్యే రాములునాయక్
వైరా, డిసెంబరు 15: వైరా నియోజకవర్గ అభివృద్ధికి తన శక్తివంచన లేకుండా కృషిచేస్తున్నానని ఎమ్మెల్యే రాములునాయక్ పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికై రెండేళ్లు అయిన సందర్భంగా మంగళవారం వైరాలోని తమ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. గిరిజన నియోజకవర్గంగా వైరా ఉందని ఇంకా అభివృద్ధి చెందాల్సి ఉందని పేర్కొన్నారు. 2009లో వైరా నియోజకవర్గం ఏర్పడిన అభివృద్ధి మాత్రం ఆశించిన స్థాయిలో జరగలేదన్నారు. తాను 2018 ఎన్నికల్లో స్వతంత్ర ఎమ్మెల్యేగా ఎన్నికై టీఆర్‌ఎ్‌సలో చేరానని గడిచిన రెండేళ్లుగా నియోజకవర్గ అభివృద్ధికి కృషిచేస్తున్నానని పేర్కొన్నారు. మిగిలిన తన పద పదవికాలంలో నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషిచేస్తానని ప్రకటించారు. కేసీఆర్, కేటీఆర్, మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఎంపీ నామా అందరి సహకారంతో నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తానని దీనిలో అందరూ భాగస్వాములు కావాలని పేర్కొన్నారు.రాష్ట్ర మార్క్‌ఫెడ్ వైస్‌చైర్మన్ బొర్రా రాజశేఖర్, మునిసిపల్ చైర్మన్, వైస్‌చైర్మన్ సూతకాని జైపాల్, సీతరాములు, జడ్పీటీసీ కనకదుర్గ పాల్గొన్నారు.