ఎత్తిన జెండా దించం : కాంగ్రెస్‌ కవాతులో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

ABN , First Publish Date - 2020-12-29T05:21:03+05:30 IST

ఎత్తిన జెండా దించం : కాంగ్రెస్‌ కవాతులో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

ఎత్తిన జెండా దించం : కాంగ్రెస్‌ కవాతులో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
కవాతులో సీఎల్పీ నేత భట్టి, మద్దతు తెలిపిన వామపక్షాల నాయకులు, కవాతులో పాల్గొన్న కార్యకర్తలు

మోదీ, కేసీఆర్‌లకు గుణపాఠం తప్పదు

కేసుల భయంతోనే సీఎం యూటర్న్‌

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

ఖమ్మంలో కాంగ్రెస్‌ కవాతు

కదంతొక్కిన నాయకులు, కార్యకర్తలు

ఖమ్మం, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతిప్రతినిధి): రైతు వ్యతిరేక చట్టాలను అమలు చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ, వాటికి మద్దతు ఇస్తున్న సీఎం కేసీఆర్‌కు గుణపాఠం తప్పదని సీఎల్పీనేత మల్లు భట్టి విక్రమార్క హెచ్చరించారు. స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తితో ఎత్తిన జెండా దించకుండా విపక్షాలతో కలిసి రైతు సమస్యలపై సంఘటిత పోరాటం చేయాలని ఆయన శ్రేణులకు పిలపునిచ్చారు. కాంగ్రెస్‌ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేంద్ర వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఖమ్మం లో కవా తు నిర్వహించా రు. పెవిలియన్‌గ్రౌండ్‌ నుంచి ధర్నాచౌక్‌ వరకు జరిగిన ఈ కవాతులో కార్యక్తలతో కలిసి సీఎల్పీ నేత భట్టి జెండా చేతపట్టి నడిచారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలను అడ్డుకుంటానని ప్రకటించిన ముఖ్యమంత్రి.. కేసులు, జైళ్ల భయంతోనే మాటమార్చా రన్నారు. వచ్చే ఏడాది నుంచి పంటలు కొనుగోలు చేయం, రూ.7500కోట్లు నష్టం వచ్చిందని, నిర్బంధ వ్యవసాయాన్ని వెనక్కి తీసుకుంటున్నామని చెప్పడం ద్వారా కేసీఆర్‌ ప్రభుత్వం ఒక వ్యాపార సంస్థలా మారిందన్నారు. తెలంగాణ రైతుల ఆకాంక్షలను మోదీకి తాకట్టు పెట్టారని, పంటను కొనుగోలు చేయమని చెప్పడం, మోదీకి అనుకూలంగా వ్యవహించడమేనన్నారు. రైతులు జీవితా లను గుజరాత్‌ వ్యాపారుల చేతుల్లో పెట్టేలా మోదీ బిల్లులు తెచ్చారని, పంటలు కార్పొరేట్‌ చేతుల్లోకి వెళితే రైతులు కుప్పకూలే పరిస్థితి ఉంటుందన్నారు. ఈ చట్టాలను వెనక్కి తీసుకునే వరకు కాంగ్రెస్‌ పక్షాన విపక్షాలతో కలిసి పోరాటం సాగిస్తామని, ఇందుకు రైతులు కలిసి రావాలన్నారు. రాష్ట్రంలో నిర్బంధ వ్యవ సాయం పేరుతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సాగు ఆంక్షలు తెస్తే నిలదీశామని, రైతులు, విపక్షాలు చెప్పినా మాటవినలేదని, చెప్పిన పంట లు వేస్తేనే రైతుబంధు ఇస్తామని చెప్పిన కేసీఆర్‌, ఇప్పుడు భయపడి తోకముడిచారని.. ఇది రైతు, కాంగ్రెస్‌, విపక్షాల విజయ మన్నారు. ప్రభుత్వం బాధ్యతారహి తంగా వ్యవహరిస్తే అటు ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌ మెడలు వంచి పంటలకు గిట్టుబాటు ధర వచ్చేలా.. పంటలు కొనేవరకు సంఘటిత పోరాటం సాగిస్తామని హెచ్చరించారు. అప్పటివరకు ఎత్తి న జెండా దించేదిలేదని కాంగ్రెస్‌ కార్యకర్త లు, గ్రామస్థాయినుంచి ఆందోళ నకు సన్నద్ధం కావాలని సూచించారు. గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాలు వ్యవసాయం బాగుం డాలని మద్దతు ధర ప్రకటించి కొను గోలు చేసి వ్యవసాయాన్ని కాపాడితే ఇప్పుడు ప్రభుత్వం తప్పించుకునే వైఖరిలో ఉందని, ఇది ప్రతి రైతు గమనించాలని గుర్తుచేశారు. రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటుంటే కాంగ్రెస్‌ చూస్తూ ఊరుకోదని, రైతుల కోసం ఎంతటి ఉద్యమానికైనా సిద్ధమ న్నారు. ఢిల్లీలో రైతులు సాగిస్తున్న ఉద్యమానికి ఖమ్మం జిల్లా రైతులు అండగా ఉంటారని, వారి ఉద్యమానికి మద్దతుగా విపక్షాలతో కలిసి ఐక్య కార్యాచరణ సాగిస్తామ న్నారు. కవాతులో మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, ఖమ్మం డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌, ఓబీసీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు కత్తి వెంకటస్వామి, నగర అధ్యక్షుడు మహ్మద్‌ జావీద్‌, సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, సీపీఐ జిల్లాకార్యదర్శి పోటు ప్రసాద్‌, సింగు నర్సింహారావు, జడ్పీటీసీలు ప్రవీణ్‌నాయక్‌ బెల్లం శ్రీను, సుధీర్‌బాబు, కిసాన్‌ ఖేత్‌ నేత శేఖర్‌గౌడ్‌, బీసీసెల్‌ ఉపాధ్యక్షుడు సత్యనారాయణ, నగర కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ దీపక్‌చౌదరి, కార్పొరేటర్లు బాలగంగాధర్‌తిలక్‌, వడ్డెబోయిన నర్సింహారావు పాల్గొన్నారు.


Updated Date - 2020-12-29T05:21:03+05:30 IST