ముగిసిన పట్టభద్రుల ఓటరు నమోదు

ABN , First Publish Date - 2020-11-07T09:54:44+05:30 IST

పట్టభద్రుల ఓటర్ల దరఖాస్తుకు శుక్రవారం సాయంత్రంతో గడువు ముగిసింది. గడువు చివరి నాటికి జిల్లాలో పట్టభద్రులు భారీగానే స్పందించారు

ముగిసిన పట్టభద్రుల ఓటరు నమోదు

1లక్షా31వేల209 దరఖాస్తుల దాఖలు


ఖమ్మం కలెక్టరేట్‌, నవంబరు 6: పట్టభద్రుల ఓటర్ల దరఖాస్తుకు శుక్రవారం సాయంత్రంతో గడువు ముగిసింది. గడువు చివరి నాటికి జిల్లాలో పట్టభద్రులు భారీగానే స్పందించారు. గతంలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 84,282మంది ఓటర్లు ఉండగా శుక్రవారం సాయంత్రం వరకు  1లక్షా31వేల209 దరఖాస్తులు నమోదయ్యాయి. ఖమ్మం జిల్లాలో (ఆన్‌లైన్‌లో 55,561, మాన్యువల్‌గా 32,712 ) 88,272మంది దరఖాస్తు చేశారు.  భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో (ఆన్‌లైన్‌లో 40,672, మాన్యువల్‌గా 2,242) 42,936 మంది దరఖాస్తు చేశారు. నమోదైన దరఖాస్తులను ఈనెల 25 వరకు విచారించి డిసెంబరు 1న ముసాయిదా జాబితాను విడుదల చేయనున్నారు. డిసెంబరు 1నుంచి ముసాయిదా జాబితాపై అభ్యంతరాలను స్వీకరించడంతో పాటు తిరిగి కొత్తగా ఓటు హక్కు పొందడానికి తిరిగి అవకాశాన్ని కల్పించనున్నారు. డిసెంబరు 31 వరకు క్లెయింలు, అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత  2021 జనవరి 18న తుదిజాబితాను విడుదల చేయనున్నారు.  

Updated Date - 2020-11-07T09:54:44+05:30 IST