దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం చెల్లించాలి: సీపీఐ
ABN , First Publish Date - 2020-08-20T10:33:33+05:30 IST
వర్షాలకు దెబ్బతిన్న పెసర, పత్తి తదితర పంటలకు నష్టపరిహారం చెల్లించాలని సీపీఐ జిల్లాకమిటీ సభ్యులు ఏపూరి రవీంద్రబాబు, దూసరి

చింతకాని, ఆగస్టు 19: వర్షాలకు దెబ్బతిన్న పెసర, పత్తి తదితర పంటలకు నష్టపరిహారం చెల్లించాలని సీపీఐ జిల్లాకమిటీ సభ్యులు ఏపూరి రవీంద్రబాబు, దూసరి శ్రీరాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలంలోని నేరెడ గ్రామంలో ఇటీవల కురుస్తున్న వర్షాలకు దెబ్బతిన్న పెసర పంటను బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో వేలాది ఎకరాల్లో వరి, పత్తి, పెసర, కంది పంటలు నీటమునగటంతో రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి దెబ్బతిన్న పంటలను సర్వేచేసి ఎకరాకు రూ.20వేలు చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఏఈవో హరికృష్ణకు ఒక వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి దావులూరి మల్లిఖార్జున్‌రావు, మండల నాయకులు రాగం లింగబాబు, పొనుకుంట్ల వెంకన్న పాల్గొన్నారు.