‘డబుల్‌’ సదుపాయాలపై ప్రత్యేక తనిఖీ

ABN , First Publish Date - 2020-12-04T03:32:36+05:30 IST

జిల్లాలో నిర్మించిన రెండు పడక గదుల నిర్మాణాల నాణ్యత, మౌళిక సదుపాయాల కల్పన పరిశీలనకు ప్రత్యేక తనిఖీ బృందాల ఏర్పాటుకు కార్యాచరణ ప్రణాళిక సిద్దం చేయాలని జిల్లా కలెక్టర్‌ ఎంవీ రెడ్డి అధికారులను ఆదేశించారు.

‘డబుల్‌’ సదుపాయాలపై ప్రత్యేక తనిఖీ
వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న కలెక్టర్‌

కలెక్టర్‌ ఎంవీ రెడ్డి ఆదేశం

కొత్తగూడెం కలెక్టరేట్‌, డిసెండర్‌ 3: జిల్లాలో నిర్మించిన రెండు పడక గదుల నిర్మాణాల నాణ్యత, మౌళిక సదుపాయాల కల్పన పరిశీలనకు ప్రత్యేక తనిఖీ బృందాల ఏర్పాటుకు కార్యాచరణ ప్రణాళిక సిద్దం చేయాలని జిల్లా కలెక్టర్‌ ఎంవీ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌ నుంచి రెండు పడక గదుల ఇండ్ల నిర్మాణాలపై రెవెన్యూ, పంచాయితీరాజ్‌, గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్‌ అధికారులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణం పూర్త యిన వాటికి లబ్దిదారుల ఎంపిక వచ్చే గురువారం నాటికి పూర్తిచేసి జాబితాను సిద్ధం చేయాలని తహసీల్దార్లను ఆదేశించారు. గిరిజన సంక్షేమ శాఖ ద్వారా నిర్మాణం చేయాల్సిన 13 యూనిట్లకు టెండర్లు ఈనెల 20వ తేదీ వర కు పూర్తిచేయాలని, నిర్లక్ష్యం వహిస్తే 20వ తేదీ తర్వాత ప్ర భుత్వానికి సరెండర్‌ చేస్తామని హెచ్చరించారు.  నిర్దేశించిన గ్రామాల్లో ఇళ్ల నిర్మాణానికి స్థలం అందుబాటులో లేని పక్షంలో ఆయా నియోజకవర్గ శాసనసభ్యుల దృష్టికి తెచ్చి అదే మండలంలోని మరొక గ్రామంలో నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. నిర్మాణాలు పూర్తయిన ఇళ్లకు మౌలిక సదుపాయాల  కల్పనకు నిధులు కేటాయింపుకు ప్రతిపాదనలు పంపాలని ఆయా ఇంజనీరిం గ్‌ అధికారులను ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్సులో ఐటిడిఏ పీవో గౌతం, అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, అనుదీప్‌, ఇంజనీరింగ్‌ అఽధికారులు పాల్గొన్నారు.  

అవగాహన సమావేశాలు నిర్వహించాలి

జిల్లాలో నియోజకవర్గాల వారీగా ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంపై నియోజవర్గాలు, మండలాల వారిగా రాజకీయ పార్టీల ప్రతినిధులతో అవగాహన సమావేశాలు నిర్వహించాలని కలెక్టర్‌ ఎంవీ రెడ్డి సహయ రిటర్నింగ్‌ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌ సమావేశపు మందిరం నుంచి నూతన ఓటరు నమోదు, ఓటరుజాబితా, పోలింగ్‌ కేంద్రాల్లో మార్పులు, చేర్పులు, మరణించిన వ్యక్తుల ఓట్లు తొలగింపు తదితర అంశాలపై ఎన్నికల రిటర్నింగ్‌, సహాయ రిటర్నింగ్‌, బూత్‌లెవల్‌ అధికారులతో వీడియో కాన్పరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బూత్‌స్థాయి అధికా రు లు అన్ని పొలింగ్‌ కేంద్రాల్లో అందుబాటులో ఉండాలన్నారు. జాబితాల్లో అభ్యంతరాలుంటే ఈ నెల 15లోగా తహ సీల్దార్‌ కార్యాలయంలో  దరఖాస్తు చేయాలని సూచించారు.


Updated Date - 2020-12-04T03:32:36+05:30 IST