అర్ధరాత్రి యథేచ్ఛగా మట్టి అక్రమ తోలకాలు

ABN , First Publish Date - 2020-03-08T11:56:12+05:30 IST

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో కొన్ని ప్రాంతాల్లో సంబంధిత శాఖ అనుమతులు లేకుండా రాత్రుల్లు మట్టిని అక్రమంగా ట్రాక్టర్ల

అర్ధరాత్రి యథేచ్ఛగా మట్టి అక్రమ తోలకాలు

సత్తుపల్లిరూరల్‌, మార్చి7: ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో కొన్ని ప్రాంతాల్లో సంబంధిత శాఖ అనుమతులు లేకుండా రాత్రుల్లు మట్టిని అక్రమంగా ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. మూతపడిన ఎన్టీఆర్‌ వరదనీటి కాలువ సమీపంలో పట్టాభూముల్లో చీకటి పడ్డాకా జేసీబీ సహాయంతో ట్రాక్టర్లకు ట్రాక్టర్ల మట్టిని పట్టణంలోని గృహ అవసరాలకు అక్రమంగా తరలిస్తున్నారు. దీంతో వేగంగా వెళ్తున్న ట్రాక్టర్ల శబ్దాలకు ప్రజలతో పాటు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని, నిత్యం చీకటిలో సాగుతున్న ఈ తతంగంపై అధికారులు నోరు విప్పాలని ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నాయి.

Updated Date - 2020-03-08T11:56:12+05:30 IST