పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ABN , First Publish Date - 2020-12-20T03:33:36+05:30 IST

పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు.

పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
క్రిస్మస్‌ కానుకలు అందజేస్తున్న ఎమ్మెల్యే

ఎమ్మెల్యే రేగా కాంతారావు 

మణుగూరులో క్రిస్మస్‌ కానుకల పంపిణీ

మణుగూరుటౌన్‌, డిసెంబరు 19: పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. శనివారం స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు ప్రభుత్వ తరుపున తహసీల్దార్‌ లూథర్‌ విల్సన్‌ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన సెమీ క్రిస్మస్‌ వేడుకల్లో ఆయన ముఖ్య అతిఽథిగా పాల్గొని క్రైస్తవ కుటుంబాలను ఉద్దేశించి మాట్లాడారు. పేద ప్రజలు పండుగ రోజున కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండాలన్న ఉద్దేశ్యంతో సీఎం కేసీఆర్‌ క్రిస్మస్‌ కానుకలు పంపిణీ చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పోశం నర్సింహారావు, ఎంపీడీవో వెంకటేశ్వర్లు, వైస్‌ ఎంపీపీ కేవీరావు, సొసైటీ అద్యక్షుడు కుర్రి నాగేశ్వరరావు, శామ్యుల్‌రాజ్‌, జేమ్స్‌ పాల్గొన్నారు.

Read more