ఉమ్మడి ఖమ్మం జిల్లా చిట్‌రిజిస్ట్రార్‌ హఠాన్మరణం

ABN , First Publish Date - 2020-12-11T05:05:41+05:30 IST

ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల చిట్‌ రిజిస్ట్రార్‌ ఎస్‌కే. మిరాజ్‌ గురువారం సాయంత్రం హైదరాబాద్‌లో గుండెపోటుతో మృతి చెందారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లా చిట్‌రిజిస్ట్రార్‌ హఠాన్మరణం

ఖమ్మంటౌన్‌, డిసెంబర్‌ 10: ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల చిట్‌ రిజిస్ట్రార్‌ ఎస్‌కే. మిరాజ్‌ గురువారం సాయంత్రం హైదరాబాద్‌లో గుండెపోటుతో మృతి చెందారు. 2001లో ఖమ్మం, మధిర, కల్లూరులలో సబ్‌రిజిస్ట్రార్‌గా పనిచేసిన మీరాజ్‌ ఉద్యోగోన్నతిపై ఉమ్మడి జిల్లా రిజిస్ట్రార్‌గా 2015 నుంచి పనిచేస్తున్నారు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం హైదరాబాద్‌లో గుండెపోటుతో మృతి చెందారు. ఉమ్మడి జిల్లా చిట్‌ రిజిస్ట్రార్‌గా ఆయన ఎన్నో చర్యలు తీసుకొని, సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో అవినీతికి తావులేకుండా చేశారు. అవినీతి ఆరోపణలు ఉన్న ఉద్యోగులపై కఠినంగా వ్యవహరించారు. మృదుస్వభావిగా పేరు తెచ్చుకున్న మీరాజ్‌ విధుల విషయంలో అలసత్వాన్ని సహించేవారుకాదు. కిందిస్థాయి ఉద్యోగులతో స్నేహపూర్వకంగా ఉండేవారు. ఆయన మృతదేహాన్ని కడసారి సందర్శించేందుకు ఖమ్మం జాయింట్‌ రిజిస్త్రార్‌ రవీంద్రబాబుతో సహా ఉమ్మడి జిల్లాలోని సబ్‌రిజిస్ట్రార్లు హైదరాబాద్‌ వెళ్లారు.


Updated Date - 2020-12-11T05:05:41+05:30 IST