చెల్లని చెక్కు కేసులో మూడు నెలల జైలు

ABN , First Publish Date - 2020-12-29T04:04:08+05:30 IST

ఖమ్మం పట్టణానికి చెందిన పీ. దశరధ్‌కు చెల్లని చెక్కు కేసులో 3నెలల జైలుశిక్షతో పాటు ఫిర్యాదీకి రూ.2లక్షలు చెల్లించాలని ఖమ్మం మద్యపాన ఆబ్కారీ ప్రత్యేక న్యాయస్థాన న్యాయమూర్తి రుబీనా ఫాతిమా సోమవారం తీర్పు చెప్పారు...

చెల్లని చెక్కు కేసులో మూడు నెలల జైలు

ఖమ్మంలీగల్‌, డిసెంబరు28: ఖమ్మం పట్టణానికి చెందిన పీ. దశరధ్‌కు చెల్లని చెక్కు కేసులో 3నెలల జైలుశిక్షతో పాటు ఫిర్యాదీకి రూ.2లక్షలు చెల్లించాలని ఖమ్మం మద్యపాన ఆబ్కారీ ప్రత్యేక న్యాయస్థాన న్యాయమూర్తి రుబీనా ఫాతిమా సోమవారం తీర్పు చెప్పారు... ఖమ్మం పట్టణానికి చెందిన ఫిర్యాది జే.కృష్ణారావు వద్ద 2013 ఫిబ్రవరి 17న తన కుటుంబ అవసరాల నిమిత్తం రూ.1.50లక్షలు అప్పుగా తీసుకున్నారు. రుణం తిరిగి చెల్లించమని ఒత్తిడి చేయటంతో నిందితుడు 2015 మార్చి 27న రూ.2లక్షలకు చెక్కు ఇచ్చాడు. ఫిర్యాదీ చెక్కును తన బ్యాంక్‌ ఖాతాలో జమచేయగా, నిందితుడి ఖాతాలో సరిపడా నగదు లేకపోవటంతో తిరస్కరణకు గురైంది. ఫిర్యాదీ తన న్యాయవాది ద్వారా లీగల్‌నోటీస్‌ జారీ చేసి, కోర్టులో ప్రయివేట్‌ కేసు దాఖలు చేశాడు. కేసును విచారించిన న్యాయమూర్తి నేరం రుజువు కావటంతో సోమవారం తీర్పు చెప్పారు. 

Updated Date - 2020-12-29T04:04:08+05:30 IST