నేడు నాగుల చవితి

ABN , First Publish Date - 2020-11-18T05:39:35+05:30 IST

ఉమ్మడి జిల్లాలో బుధవారం నాగులచవితి పూజలకోసం ఆలయాలు, పట్టలు ముస్తాబయ్యాయి. కార్తీక మాసంలో వచ్చే చతుర్థి తిథిని నాగుల చవితి అంటారు. భక్తులు ఆ రోజున పుట్టల వద్ద పాలు, నెయ్యి

నేడు నాగుల చవితి

చవితి పూజలకు ఆలయాలు ముస్తాబు


ఖమ్మం సాంస్కృతికం, నవంబరు 17: ఉమ్మడి జిల్లాలో బుధవారం నాగులచవితి పూజలకోసం ఆలయాలు, పట్టలు ముస్తాబయ్యాయి. కార్తీక మాసంలో వచ్చే చతుర్థి తిథిని నాగుల చవితి అంటారు.  భక్తులు ఆ రోజున పుట్టల వద్ద పాలు, నెయ్యి పోసి వారి మొక్కులు తీర్చుకుంటారు. పుట్టలో ఆవుపాలు, నెయ్యి పోయడంతో పాటు రకరకాల పండ్లను ఉంచి పసుపు కుంకుమలతో పూజలు చేస్తారు. జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలతో పాటు ఖమ్మం, మధిర, సత్తుపల్లి, తల్లాడ, భద్రాచలం, కొత్తగూడెం, ఇల్లెందు, పాల్వంచ తదితర ప్రాంతాల్లోని ఆలయాలు, పొలాల వద్ద ఉన్న పుట్టలను నాగుల చవితికి సిద్ధం చేశారు. తెల్లవారుజామునుంచే పుట్టల్లో పాలు, నెయ్యి పోసి భక్తులు రోజంతా ఉపవాసం ఉండనున్నారు.

Updated Date - 2020-11-18T05:39:35+05:30 IST