30న ఖమ్మంలో చావాశివకోటి సాహితీ ఉత్సవం

ABN , First Publish Date - 2020-12-28T04:55:33+05:30 IST

వైష్ణవి ఫిలిమ్స్‌, యువ కళావాహిని సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 30న ఖమ్మంలో చావాశివకోటి సాహితీ ఉత్సవాన్ని నిర్వహించనున్నారు.

30న ఖమ్మంలో చావాశివకోటి సాహితీ ఉత్సవం

రచయిత శివకోటికి చలం పురస్కార ప్రధానం

ఖమ్మం, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): వైష్ణవి ఫిలిమ్స్‌, యువ కళావాహిని సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 30న ఖమ్మంలో చావాశివకోటి సాహితీ ఉత్సవాన్ని నిర్వహించనున్నారు. ఈ ఉత్సవంలో భాగంగా ప్రముఖ రచయిత చావాశికోటికి గుడిపాటి వెంకటచలం పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు. ఖమ్మం నగరంలోని కేఎల్‌సీ కళాప్రాంగణంలో డిసెంబరు 30న సాయంత్రం నాలుగుగంటలకు ఉత్సవాన్ని నిర్వహించనున్నట్టు యువకళావాహిని అధ్యక్షుడు వైకే నాగేశ్వరరావు, వైష్టవి ఫిలిమ్స్‌ అధినేత అట్లూరి నారాయణరావు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా రాష్ట్ర రవాణాశాఖమంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ఎంపీ నామా నాగేశ్వరరావు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌, సీపీ తఫ్సీర్‌ ఇక్బాల్‌తో పాటు ప్రముఖ చలనచిత్రనటి దివ్యవాణి, ప్రఖ్యాత రచయిత కస్తూరి మురళీకృష్ణ పాల్గొంటారని తెలిపారు.


Updated Date - 2020-12-28T04:55:33+05:30 IST