హైదరాబాద్‌, వరంగల్‌ సరసన ఖమ్మం సుడా.

ABN , First Publish Date - 2020-09-06T10:28:57+05:30 IST

రాష్ట్రంలో హైదరాబాద్‌ (హుడా), వరంగల్‌ (కుడా) సరసన ఖమ్మం సుడాను నిలిపేందకు నిరంతరం ..

హైదరాబాద్‌, వరంగల్‌ సరసన ఖమ్మం సుడా.

ఛైర్మన్‌ బచ్చు విజయ్‌కుమార్‌.


ఖమ్మం కార్పొరేషన్‌, సెప్టెంబర్‌ 5: రాష్ట్రంలో హైదరాబాద్‌ (హుడా), వరంగల్‌ (కుడా) సరసన ఖమ్మం సుడాను నిలిపేందకు నిరంతరం కృషిచేస్తానని సుడా ఛైర్మన్‌ బచ్చు విజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. శనివారం కరీంనగర్‌, నిజామాబాద్‌, సిద్ధిపేట జిల్లాల అర్బన్‌ డెవల్‌పమెంట్‌ అధికారులతో కలిసి విజయ్‌కుమార్‌ వరంగల్‌ అర్బన్‌ డెవల్‌పమెంట్‌ అధారిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధిపనులను పరిశీలించేందుకు క్షేత్రస్ధాయి పర్యటనకు వెళ్లారు. జరుగుతున్న అభివృద్ధిపనులను, కుడా పరిధిలో మంజూరయ్యే  నిధుల గురించి అక్కడి అధికారులను విజయ్‌కుమార్‌ అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రమంత్రులు కేటీఆర్‌, పువ్వాడ అజయ్‌కుమార్‌లు నగరాభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని ఈ సందర్భంగా సుడా ఛైర్మన్‌ విజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. అనంతరం ఖమ్మం సుడాకు తొలి ఛైర్మన్‌గా ఉన్న విజయ్‌కుమార్‌ను కుడా కార్యాలయంలో సన్మానించారు.


Updated Date - 2020-09-06T10:28:57+05:30 IST