విద్యుత్‌ అధికారులపై కేసు నమోదుకు కోర్టు ఆదేశం

ABN , First Publish Date - 2020-12-11T05:07:35+05:30 IST

వి.వెంకటాయపాలెం గ్రామానికి చెందిన మూడు వెంకన్న వేసిన ప్రైవేటు ఫిర్యాదుపై ప్రాఽథమిక విచారణ, సాక్షుల నమోదు అనంతరం ప్రఽథమ శ్రేణి న్యాయమూర్తి శ్రీమతి ఎం.ఉషశ్రీ ఇన్‌చార్జి 3 అడిషనల్‌ జేఎఫ్‌సీ కోర్టు ఖమ్మం ఏఈ అజ్మీర రమేష్‌, ఏడీఈ లకావత్‌ తిలక్‌, డీఈ లునావత్‌ రాములు లపై కేసు నమోదుచేసి ముద్దాయిలకు సమన్లు జారీచేసింది.

విద్యుత్‌ అధికారులపై కేసు నమోదుకు కోర్టు ఆదేశం

ఖమ్మంలీగల్‌, డిసెంబరు10:  వి.వెంకటాయపాలెం గ్రామానికి చెందిన మూడు వెంకన్న వేసిన ప్రైవేటు ఫిర్యాదుపై ప్రాఽథమిక విచారణ, సాక్షుల నమోదు అనంతరం ప్రఽథమ శ్రేణి న్యాయమూర్తి శ్రీమతి ఎం.ఉషశ్రీ ఇన్‌చార్జి 3 అడిషనల్‌ జేఎఫ్‌సీ కోర్టు ఖమ్మం ఏఈ అజ్మీర రమేష్‌, ఏడీఈ లకావత్‌ తిలక్‌, డీఈ లునావత్‌ రాములు లపై కేసు నమోదుచేసి ముద్దాయిలకు సమన్లు జారీచేసింది.  మూడు వెంకన్నకు అతని భార్యకు మూడు విద్యుత్‌ సర్వీస్‌ కనెక్షన్లు ఉండగా ఏ విధమైన బాకీ బకాయిలు లేకుండా బిల్లులు చెల్లిస్తూ ఉండగా డిసెంబరు 2019లో అకస్మాత్తుగా చాల ఎక్కువ మొత్తంకు బిల్లులు రావడంతో వెంకన్న విద్యుత్‌ అధికారులను సంప్రదించగా సాంకేతిక కారణాతో అధిక మొత్తంలో బిల్లులు వచ్చాయని బిల్లులో సగం కట్టమని సమస్య పరిష్కారం అనంతరం భవిష్యత్‌ బిల్లులతో అడ్జస్ట్‌ చేస్తామని లేకుంటే విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తామన్నారు. సదరు అధికారుల మాటల నమ్మి దఫ దఫాలుగా రూ.63,000లు చెల్లించినప్పటికి ది.15-06-2020న సదరు విద్యుత్‌ అధికారులు వెంకన్న ఇంటిలోనికి ప్రవేశించి దుర్బాషలాడుతూ విద్యుత్‌ వైర్లు కట్‌ చేశారు. వెంకన్న రఘునాధపాలెం పోలీసువారికి ది.16-06-2020 ఫిర్యాదుచేసినా పట్టించుకోకపోవడంతో 3 అడిషనల్‌ జేఎఫ్‌సీఎం కోర్టు ఖమ్మం వారి వద్ద తన న్యాయవాది ముదిరెడ్డి నిరంజన్‌రెడ్డి ద్వారా ప్రైవేటు కంప్లెయింట్‌ దాఖలు చేశాడు. సాక్షాలు నమోదుచేసుకుని కేసు సీసీ నెంబరు 2922/2020గా నమోదుచేసి ముద్దాయిలకు కోర్టు సమన్లు జారీచేసింది.


Updated Date - 2020-12-11T05:07:35+05:30 IST