ఏఎన్‌ఎం శిక్షణకు కరోనా గండం
ABN , First Publish Date - 2020-10-03T11:19:01+05:30 IST
వెంకి పెళ్లి సుబ్బిచావుకు వచ్చిన చందంగా జిల్లాలో ప్రభుత్వ ఏఎన్‌ఎం శిక్షణ.
ఖమ్మంసంక్షేమవిభాగం, ఆక్టోబరు 2: వెంకి పెళ్లి సుబ్బిచావుకు వచ్చిన చందంగా జిల్లాలో ప్రభుత్వ ఏఎన్‌ఎం శిక్షణ. కరోనా వైరస్ ప్రారంబం కావాటంతో తత్కాలికంగా ఏఎన్‌ఎం శిక్షణకు సెలవ్ ఇవ్వటంతో ఖాళీగా ఉన్న శిక్షణా కేంద్రాన్ని కరోనా రోగుల నమోదుకు కేటాయించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 15నుంచి ఏఎన్‌ఎం శిక్షణ ప్రారంబించేందుకు అన్ని జిల్లాల్లో శిక్షణా కేంద్రాలను తిరిగి ఏర్పాటు చేశారు. కాని ఖమ్మంలో మాత్రం భవనం తిరిగి అప్పగించకపోవటంతో ఏఎన్‌ఎం శిక్షణకు కరోనా గండం ఏర్పాడింది. అయితే ఇప్పటికే ఆరు నెలల కాలం శిక్షణ లేకుండానే గడిచిపోయింది. నవంబర్‌లో వార్షిక పరీక్షలు జరగనున్నాయి.
కరోనా బాధితుల వివరాల నమోదు ప్రణాళిక
ఇంటర్ కనీస అర్హతగా జిల్లా ఆసుపత్రిలో ఏఎన్‌ఎం(ఎంపీహెచ్‌డబ్ల్యూ)రెండేళ్ల శిక్షణ కేంద్రం ప్రభుత్వం అధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. అయితే జిల్లాలో కరోనా వైరస్ ప్రభావంతో మార్చినుంచి ఏఎన్‌ఎం శిక్షణ విద్యార్ధులకు సెలవ్‌లు ఇచ్చి ఇంటికి పంపారు. శిక్షణా కేంద్రాన్ని కరోనా బయట రోగుల నమోదుకు కేటాయించారు. ఆరు నెలల తర్వాత తిరిగి శిక్షణ తరగతులను ఈనెల 15నుంచి ప్రారంబించాలని రాష్ట్ర వైద్యవిధాన పరిషత్ అధికారులు సర్యూలర్ జారీ చేశారు. కాని ఖమ్మంలో ఏఎన్‌ఎం శిక్షణా కేంద్రంలో మాత్రం కరోనా బయట రోగుల నమోదు జరుగుతోంది కాని భవనం తిరిగి అప్పగించలేదు. భవనం శిక్షణకు ఇచ్చిన తర్వాత విద్యార్ధులకు కరోనా వైరస్ వ్యాప్తి జరగకుండా శానిటేషన్ చేసి కొన్ని రోజులు పాటు ఖాళీగా ఉంచి శిక్షణకు వినియోగించాల్సి ఉంటుంది. జిల్లా కలెక్టర్ కర్ణన్ స్పందించి ఏఎన్‌ఎం శిక్షణకు తిరిగి భవనం అప్పగించేలా జిల్లా ఆసుపత్రి అధికారులక సూచించాలని ఏఎన్‌ఎం శిక్షణ విద్యార్ధుల తల్లిదండ్రులు కొరుతున్నారు.
187 మందికి కొవిడ్
ఖమ్మం/కొత్తగూడెం, అక్టోబరు 2 : ఉమ్మడిఖమ్మం జిల్లాలో శుక్రవారం 187మంది కొవిడ్ బారిన పడ్డారని వైద్యశాఖ అధికారులు తమ నివేదికల్లో వెల్లడించారు. ఖమ్మం జిల్లాలో జరిపిన పరీక్షల్లో 99మందికి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన పరీక్షల్లో 88మందికి పాజిటివ్ వచ్చినట్టు వైద్యాధికారులు ధ్రువీకరించారు.