ఇరుజిల్లాల్లో 70మందికి కొవిడ్‌

ABN , First Publish Date - 2020-12-12T05:11:43+05:30 IST

ఇరుజిల్లాల్లో 70మందికి కొవిడ్‌

ఇరుజిల్లాల్లో 70మందికి కొవిడ్‌

కొత్తగూడెం కలెక్టరేట్‌ /ఖమ్మం సంక్షేమవిభాగం, డిసెంబరు 11: ఇరుజిల్లాల్లో కరోనా బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. శుక్రవారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 70మంది కొవిడ్‌బారిన పడినట్టు వైద్యఆరోగ్యశాఖ లెక్కలు చెబుతు న్నాయి. భద్రాద్రి జిల్లాలో శుక్రవారం మొత్తం 1987మందికి పరీక్షలు నిర్వ హించగా 52మందికి పాజిటివ్‌ వచ్చినట్టు జిల్లా వైద్యాధికారులు తెలిపారు. వీరిలో కొత్తగూడెం డివిజన్‌లో 31, భద్రాచలం డివిజన్‌లో 21మంది ఉన్నారని స్పష్టం చేశారు. ఇక ఖమ్మంజిల్లాలో 29మంది కొవిడ్‌ బారిన పడ్డారని రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ అధికారులు తమ రోజువారీ నివేదికలో వెల్లడించారు. 

Updated Date - 2020-12-12T05:11:43+05:30 IST