పంచాయతీలపై.. కొవిడ్‌ ప్రచార భారం

ABN , First Publish Date - 2020-11-28T04:42:36+05:30 IST

పంచాయతీలపై.. కొవిడ్‌ ప్రచార భారం

పంచాయతీలపై.. కొవిడ్‌ ప్రచార భారం
కొవిడ్‌-19కి సంబంధించి స్టేజీ పినపాకలో ఏర్పాటుచేసిన ప్రచార బోర్డులు

ప్రచార బోర్డుల ఏర్పాటుకు ప్రభుత్వ ఆదేశాలు

మునిసిపాలిటీలకు ఇదే తరహా ఖర్చు

వైరా, నవంబరు 27: కొవిడ్‌-19పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ గ్రామస్థాయిలో ప్రచార బోర్డులు ఏర్పాటు చేయాలని గ్రామపంచాయతీ లకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఈ క్రమంలో ప్రచారబోర్డులకయ్యే ఖర్చులను పంచా యతీల నిధుల నుంచి ఖర్చుచేయాలని ఈనెల 22న రాష్ట్ర పంచాయతీరాజ్‌ కమిషనర్‌ ఎం.రఘు నందన్‌రావు స్పష్టం చేసింది. అయితే ఈ ప్రచారం రాష్ట్ర ప్రభుత్వం తరపున చేసినట్టుగా ముద్రిస్తుండటంతో సొమ్ము ఒకరిది.. సోకు ఒకరికి అన్న చందంగా కనిపిస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక మునిసిపాలిటీల్లో కూడా ఈ ప్రచార బోర్డులను ఏర్పాటుచేయాలని ప్రభుత్వం సూచించడంతో ఆ భారం పంచాయతీలు, మునిసి పాలిటీలపై పడుతోంది. పంచాయతీరాజ్‌ శాఖ నుంచి పంపిన నమూనాలో తయారు చేసిన ఈ ప్రచార బోర్డులకు ఒకొక్క దానికి రూ.1500చొప్పున వెచ్చించి.. రెండు ప్రచార బోర్డులను ఏర్పాటుచేయాలని, పల్లెప్రగతి, సీఎఫ్‌సీ, ఎస్‌ఎఫ్‌సీ జనరల్‌ ఫండ్స్‌ నుంచి ఈ నిధులను ఖర్చుచేసుకోవచ్చని ఆదేశాల్లో పేర్కొ న్నారు. అయితే 23వతేదీ నాటికే ప్రచార బోర్డులను ఏర్పాటుచేయాలని స్పష్టం చేయటంతో పంచాయతీ కార్యదర్శులు ఆగమేఘాల మీద వీటిని తయారు చేయించి ఏర్పాటుచేశారు. 

Updated Date - 2020-11-28T04:42:36+05:30 IST