ఖమ్మం జిల్లాలో 11మందికి కొవిడ్
ABN , First Publish Date - 2020-12-31T05:24:51+05:30 IST
ఖమ్మం జిల్లాలో 11మందికి కొవిడ్
ఖమ్మం సంక్షేమవిభాగం, డిసెంబరు 30: ఖమ్మం జిల్లాలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. బుధవారం 11మంది కొవిడ్ బారినపడినట్టు నిర్ధారణైంది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తమ రోజువారీ నివేదికలో వెల్లడించారు. ఇదిలా ఉంటే కొవిడ్ స్ట్రెయిన్‌పై అప్రమత్తంగా వ్యవహరించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. కరోనా విజృంభిస్తున్న వేళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మాస్కులు ధరించాలని, భౌతికదూరం పాటించాలని అధికారులు సూచించారు.