ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 62 మందికి కొవిడ్
ABN , First Publish Date - 2020-12-30T04:30:27+05:30 IST
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 62 మందికి కొవిడ్
కొత్తగూడెం కలెక్టరేట్/ఖమ్మం సంక్షేమవిభాగం, డిసెంబరు 29: ఇరుజిల్లాల్లో కరోనా బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. మంగళవారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 62మంది కొవిడ్‌బారిన పడినట్టు వైద్యఆరోగ్యశాఖ లెక్కలు చెబుతు న్నాయి. భద్రాద్రి జిల్లాలో మొత్తం 1507మందికి పరీక్షలు నిర్వహించగా 50మందికి పాజిటివ్ వచ్చినట్టు జిల్లా వైద్యాధికారులు తెలిపారు. వీరిలో కొత్తగూడెం డివిజన్‌లో 36, భద్రాచలం డివిజన్‌లో 14మంది ఉన్నారని స్పష్టం చేశారు. ఇక ఖమ్మం జిల్లాలో 12మంది కొవిడ్ బారినపడ్డారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తమ రోజువారీ నివేదికలో వెల్లడించారు.