నేడు గ్రీవెన్స్‌ డే రద్దు : కలెక్టర్‌

ABN , First Publish Date - 2020-03-16T12:38:35+05:30 IST

ప్రజాసమస్యలపై దరఖాస్తులు స్వీకరించేందుకు ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి (గ్రీవెన్స్‌డే) కార్యక్రమాన్ని కరోనా ఎఫెక్ట్‌

నేడు గ్రీవెన్స్‌ డే రద్దు : కలెక్టర్‌

(ఆంధ్రజ్యోతి, కొత్తగూడెం):  ప్రజాసమస్యలపై దరఖాస్తులు స్వీకరించేందుకు ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి (గ్రీవెన్స్‌డే) కార్యక్రమాన్ని కరోనా ఎఫెక్ట్‌ నేపధ్యంలో నేడు రద్దు చేస్తున్నట్టు కలెక్టర్‌ డాక్టర్‌ ఎంవీ. రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అశ్వాపురం మండలంలో ఒక వైద్య విద్యార్థినికి కరోనా పాజిటివ్‌ రావడంతో దాని ప్రభావం ఇతరులపై పడే అవకాశమున్నందున, వైరస్‌ ప్రభలకుండా ఈ చర్యలు తీసుకున్నారు. మళ్లీ ప్రభుత్వం ప్రకటించే వరకు గ్రీవెన్స్‌ కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు కలెక్టర్‌ ఆ ప్రకటనలో తెలిపారు. 


ఎన్డీ చంద్రన్న వర్గ సభ్యుల కోసం కూంబింగ్‌ ?

న్యూడెమోక్రసీ చంద్రన్న వర్గ సభ్యుల కోసం పాల్వంచ రూరల్‌  పోలీసులు  ఆదివారం తెల్లవారుజామున కూంబింగ్‌ నిర్వహించినట్టు సమాచారం. మూడు నెలల క్రితం కొత్తగూడెం లక్ష్మిదేవిపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో అరెస్ట్‌ అయిన చంద్రన్న వర్గ సభ్యుడు రామన్న శనివారం అర్ధరాత్రి పాల్వంచ మండల పరిధిలోని రెడ్డిగూడెంలో దళ సభ్యులతో రహస్య సమావేశం నిర్వహిస్తున్నారనే సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఆ ప్రాంతంలో కూంబింగ్‌ నిర్వహించగా రామన్న, ఇతర సభ్యులు తప్పించుకోగా ఒక అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

Updated Date - 2020-03-16T12:38:35+05:30 IST