టీఆర్‌ఎస్‌ను ఓడించే శక్తి బీజేపీకే ఉంది

ABN , First Publish Date - 2020-10-21T06:12:33+05:30 IST

రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ను ఓడించే శక్తి కేవలం బీజేపీకే ఉందని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి అన్నారు.

టీఆర్‌ఎస్‌ను ఓడించే శక్తి బీజేపీకే ఉంది

బీజేపీ రాష్ట్రప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌ రెడ్డి


 ఖమ్మం మయూరిసెంటర్‌, అక్టోబరు 20: రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ను ఓడించే శక్తి కేవలం బీజేపీకే ఉందని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి అన్నారు. ఖమ్మం, నల్లగొండ, వరంగల్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా మంగళవారం ఖమ్మంలోని ఓ హోటల్‌లో ఏర్పాటు చేసిన  సన్నాహక కార్యక్రమంలో ఆయన  మాట్లాడారు.  కేంద్రంలో ప్రధాని ప్రవేశపెడుతున్న పథకాలను కేసీఆర్‌ తనవిగా ప్రచారం ప్రచారం చేసుకుంటూ పబ్బం గడుతున్నాడని ఆరోపించారు. రాష్ట్రం ఏర్పడితే బతుకులు బాగుపడతాయని, ఉద్యోగాలు వస్తాయని చేప్పిన కేసీఆర్‌ తన కుటుంబానికి మాత్రం నాలుగు ఉద్యోగాలు సంపాదించుకున్నాడని  దుయ్యబట్టారు. మాటాలతో పబ్బం గడుపుకోవడం తప్ప కేసీఆర్‌ రాష్ట్రానికి చేసింది ఏమీ లేదన్నారు. ధనిక రాష్ట్రంగా చెప్పుకొంటున్న సీఎం ఆరేళ్లలో రూ.200 కోట్ల అప్పు ఎలా చేశాడో ప్రజలకు చెప్పాలన్నారు. టీఆర్‌ఎస్‌ నాయకులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో నకిలీ సర్టిఫికెట్లతో నమోదు చేస్తున్నట్లు తెలిసిందని, పద్ధతి మార్చుకోవాలన్నారు.


ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెలుపుకోసం కార్యకర్తలు శక్తివంచన లేకుండ కృషి చేయాలన్నారు, ఈ సమావేశంలో బీజేపీ కిసాన్‌ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్‌ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ, రాష్ట్ర నాయకులు దేవకి వాసుదేవరావు, గెంటేల విద్యాసాగర్‌, బైరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, దుద్దుకూరి వెంకటేశ్వరరావు, నగర అధ్యక్షుడు రుద్ర ప్రదీప్‌, నంబూరి రామ లింగేశ్వరరావు, కూసంపూడి రవీందర్‌, వేల్పుల సుధాకర్‌, వీరుగౌడ్‌, ఉపేందర్‌ గౌడ్‌, భద్రం, కుమిలి శ్రీనివాస్‌ పాల్గొన్నారు. అంతకు ముందు ఖమ్మం చేరుకున్న రాష్ట్ర కార్యదర్శికి కాల్వోడ్డు నగరంలో కాల్వొడ్డు నుంచి జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ ఆధ్వర్యంలో  స్వాగతం పలుకుతూ భారీ బైకు ర్యాలీ నిర్వహించారు.  


Updated Date - 2020-10-21T06:12:33+05:30 IST