‘చింతవర్రె’పై ప్రభుత్వానికి చిత్తశుద్ధిలేదు

ABN , First Publish Date - 2020-12-31T04:48:00+05:30 IST

చింతవర్రె ఘటనపై ప్రభుత్వానికి చిత్తశుద్ధిలేదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ (చిన్ని) ఆరోపించారు.

‘చింతవర్రె’పై ప్రభుత్వానికి చిత్తశుద్ధిలేదు
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న చిన్ని

బీజేపీ జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ

 కొత్తగూడెం పోస్టాఫీస్‌ సెంటర్‌, డిసెంబరు 30 : చింతవర్రె ఘటనపై ప్రభుత్వానికి చిత్తశుద్ధిలేదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ (చిన్ని) ఆరోపించారు. బుధవారం బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. లక్ష్మీదేవిపల్లి మండలంలోని మైలారం గ్రామంలో సుమారు 20 రోజుల క్రితం ఓ బాలికపై విద్యాబుద్ధులు నేర్పాల్సిన దొడ్డ సునిల్‌ కుమార్‌ లైంగిక దాడికి పాల్పడిన సంఘటన రాష్ట్ర ప్రజానీకాన్ని కలచివేసిందన్నారు. గిరిజన కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని బీజేపీ తీవ్రంగా పరిగణించిందన్నారు. అందులో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షు డు బండి సంజయ్‌ స్పందించి జిల్లా యంత్రాంగాన్ని, అధికారులకు తగు సూ చనలు, బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని ఆదేశిం చారన్నారు. ఐదుగురు బాలికలపై ఆ కీచక ఉపాధ్యాయుడు చేసిన ఆకృత్యాలు అత్యంత దారుణమైనవని ప్రజల ముందు బహిరంగంగానే ఆ ఉపాధ్యాయుడిని శిక్షించి విధుల నుంచి శాశ్వతంగా తొలగించాలన్నారు. స్థానిక ఎమ్మెల్యే ఎలాంటి సహాయ, ఆర్ధిక చర్యలు చేపట్టారో ప్రకటించా లన్నారు. రాష్ట్ర మంత్రుల పర్యటన అంటూ హడావిడి చేస్తున్నారే కానీ బాధితులను ఆదుకోవడంలో విఫలమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోక్సో బాలల హక్కుల నుంచి వచ్చే నష్ట పరిహారం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎంత నష్టపరిహారాన్ని ప్రకటిస్తుందో స్పష్టంగా ప్రకటించాలన్నారు.  సమావేశంలో బీజేపీ జిల్లా నాయకులు శ్రీనివాస్‌ కుమార్‌, మోకాళ్ల నాగ స్రవంతి, ఎం.ప్రభాకర్‌, అభినవ్‌, లక్ష్మణ్‌ అగర్వాల్‌, హరిహరణ్‌ పాల్గొన్నారు. 


Read more